17 : 48
ٱنظُرۡ كَيۡفَ ضَرَبُواْ لَكَ ٱلۡأَمۡثَالَ فَضَلُّواْ فَلَا يَسۡتَطِيعُونَ سَبِيلٗا
(ఓ ముహమ్మద్!) చూడు! వారు నిన్ను ఎలాంటి ఉదాహరణలతో పోల్చుతున్నారో, ఎందుకంటే వారు మార్గం తప్పారు, కావున వారు (సరైన) మార్గం పొందలేరు.
Explanation & meanings · 1
- వారు దైవప్రవక్త ('స'అస) ను మాంత్రికుడు, మంత్రజాలానికి గురి అయినవాడు, పిచ్చివాడు, జ్యోతిష్యుడు అని నోటికి వచ్చినట్లు ఆరోపించారు. ఎందుకంటే వారు మార్గభ్రష్టులైన వారు కాబట్టి వారెన్నడూ మార్గదర్శకత్వం పొందలేరు.