السؤال
س١١: ما ضد الصبر؟
11: సహనానికి వ్యతిరేకమైనది ఏమిటి?
الجواب
ج:- وهو عدم الصبر على الطاعة، وعدم الصبر عن المعصية، والتسخط على الأقدار بالقول أو الفعل.
من صوره:
- تَمنِّي الموتِ.
- قَالَ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ:
«لَا يَتَمَنَّيَنَّ أَحَدُكُمُ الْمَوْتَ مِنْ ضُرٍّ أَصَابَهُ، فَإِنْ كَانَ لَا بُدَّ فَاعِلًا فَلْيَقُلِ: اللَّهُمَّ أَحْيِنِي مَا كَانَتِ الْحَيَاةُ خَيْرًا لِي، وَتَوَفَّنِي إِذَا كَانَتِ الْوَفَاةُ خَيْرًا لِي»
متفق عليه.
- ضرْبُ الخُدودِ.
- شَقُّ الثِّيابِ.
- نَشْرُ الشُّعورِ.
- الدُّعاءُ على النفس بالهلاك.
- قال عليه الصلاة والسلام:
«لَيْسَ مِنَّا مَنْ لَطَمَ الْخُدُودَ، وَشَقَّ الْجُيُوبَ، وَدَعَا بِدَعْوَى الْجَاهِلِيَّةِ»
رواه البخاري.
- قال النبي عَلَيْهِ الصَّلَاةُ وَالسَّلَامُ:
«إِنَّ عِظَمَ الْجَزَاءِ مَعَ عِظَمِ الْبَلَاءِ وَإِنَّ اللَّهَ إِذَا أَحَبَّ قَوْمًا ابْتَلَاهُمْ، فَمَنْ رَضِيَ فَلَهُ الرضا، وَمَنْ سَخِطَ فَلَهُ السَّخَطُ»
رواه الترمذي وابن ماجة.
జవాబు: సహనానికి వ్యతిరేకమైనది అసహనం అంటే అల్లాహ్ కు విధేయత చూపడంలో మరియు పాపాలకు దూరంగా ఉండటంలో అసహనం చూపడం. మాటల ద్వారా లేదా చేతల ద్వారా అల్లాహ్ యొక్క ఆదేశాలపై అసంతృప్తి వ్యక్తం చేయడం కూడా దీని క్రిందికే వస్తుంది.
దాని రూపాలు:
- మరణాన్ని కోరుకోవడం.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు:
మీలో ఎవరూ తనకు బాధ కలిగిందని చావుని కోరుకోరాదు. తప్పనిసరి పరిస్థితుల్లోనైతే ఈ విధంగా వేడుకోవాలి: "దేవా! జీవితం నా కొరకు మేలుతో కూడుకొని ఉన్నంతవరకూ నన్ను సజీవంగా ఉంచు. మరణమే నా కొరకు శ్రేయస్కరమైనప్పుడు నాకు మరణాన్ని ప్రసాదించు".
ముత్తఫఖున్ అలైహి
- చెంపలపై కొట్టుకోవడం.
- బట్టలు చింపుకోవడం.
- జుట్టు చిందర వందరగా వదిలి వేయడం.
- తనకు త్వరగా మరణం రావాలని వేడుకోవడం.
ఆయన అలైహిస్సలాతు వస్సలాం ఇలా తెలియ చేశారు:
“(ఏదైనా కీడు, ఆపద, కష్టము కలిగినపుడు) ఎవరైతే తమ చెంపలను చరుచుకుంటూ, తమ చొక్కాలను చింపుకుంటూ, అఙ్ఞాన కాలములో చేసినట్లు బిగ్గరగా ఏడ్పులు పెడబొబ్బలు పెడతాడో, అతడు మాలోని వాడు కాడు (మాలో ఒకడుగా పరిగణించబడడు).
దీనిని బుఖారీ ఉల్లేఖించారు.
నిశ్చయంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు:
నిశ్చయంగా ఎంతపెద్ద ఆపద వస్తే దానికి అంతటి పుణ్యం లభిస్తుంది. నిస్సందేహంగా ఎవరినైతే అల్లాహ్ తఆలా ప్రేమిస్తాడో వారిని పరీక్షలకు గురిచేస్తాడు. ఎవరైతే వాటిలో సహనంగా ఓర్పుతో ఉంటాడో అల్లాహ్ అతని పట్ల సంతోషపడుతాడు. మరెవరైతే ఆగ్రహానికి గురౌతారో, అల్లాహ్ కూడా అతని పట్ల ఆగ్రహం చూపుతాడు.
అత్తిర్మిజీ మరియు ఇబ్నె మాజాఉల్లేఖించారు.