السؤال
س١٠: ما أنواع الصبر؟
ప్రశ్న10 : సహనం యొక్క రకాలు ఎన్ని?
الجواب
ج:- الصبر على طاعة الله تَعَالَى.
- الصبر عن المعصية.
- الصبر على الأقدار المؤلمة، وحمد الله على كل حال.
- قال تَعَالَى:
﴿وَٱللَّهُ يُحِبُّ ٱلصَّٰبِرِينَ﴾
[آل عمران: ١٤٦].
- وقال النبي عَلَيْهِ الصَّلَاةُ وَالسَّلَامُ:
«عجَبًا لأمْرِ المؤمنِ إنَّ أمْرَه كلَّهُ خيرٌ، وليس ذلك لأحدٍ إلَّا للمؤمنِ؛ إنْ أصابَتْهُ سَرَّاءُ شكَرَ فكان خيرًا له، وإنْ أصابَتْهُ ضَرَّاءُ صبَرَ فكان خيرًا له»
رواه مسلم.
జవాబు: మొదటిది - సర్వశక్తిమంతుడైన అల్లాహ్ కు విధేయత చూపడంలో సహనం.
రెండవది - పాపాలు మానుకోవడంలో చూపే సహనం.
మూడవది - కఠినమైన దైవాదేశాలను ఆచరణలో పెట్టడంలో చూపే సహనం మరియు అన్ని స్థితులలోనూ అల్లాహ్ నే స్తుతించడంలో చూపే సహనం.
మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
{మరియు అల్లాహ్ ఓర్పు గల వారిని ప్రేమిస్తాడు.}
[ఆలె ఇమ్రాన్: 19]
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు:
విశ్వాసి పరిస్థితి చాలా ఆశ్చర్యకరమైనది. అతను ఏ పరిస్థితిలో ఉన్నా అతనికి మేలు మాత్రమే కలుగుతుంది. ఇది కేవలం విశ్వాసి విషయంలో మాత్రమే జరుగుతుంది. అతనికి ఆనందం కలిగినప్పుడు అల్లాహ్'కు కృతజ్ఞత తెలుపు కుంటాడు, అతనికి అది మేలును ప్రసాదిస్తుంది. ఒక వేళ అతనికి కష్టం కలిగితే అతను సహనం వహిస్తాడు అది అతనికి మేలు చేస్తుంది.
దీనిని ముస్లిం ఉల్లేఖించారు.