Skip to content
సూరాల జాబితా /

الصَّافَات

الصَّافَات is chapter 37 of the Quran and has 182 verses. This page presents it in full in the Uthmani script, with a verse-by-verse translation of its meaning.

182 ఆయతులు సూరా సంఖ్య 37
ఆయత్‌కు వెళ్ళండి
తెలుగు · Muhammad
بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَٰنِ ٱلرَّحِيمِ

وَٱلصَّٰٓفَّٰتِ صَفّٗا

వరుసగా బారులు తీరి నిలుచున్న వారి (దైవదూతల) సాక్షిగా!

فَٱلزَّٰجِرَٰتِ زَجۡرٗا

మేఘాలను నడిపించే వారి (దైవదూతల) సాక్షిగా!

Explanation & meanings · 1
  1. ఈ ఆయత్ ఈ విధంగా కూడా వివరించబడింది. 'తరుమగొట్టే వారి సాక్షిగా!'

فَٱلتَّٰلِيَٰتِ ذِكۡرًا

ఈ ఉపదేశాన్ని (ఖుర్ఆన్ ను, అల్లాహ్ దగ్గరి నుండి మానవులకు) తెచ్చే వారి (దైవదూతల) సాక్షిగా!

Explanation & meanings · 1
  1. ఈ ఆయత్: 'ఖుర్ఆన్ పఠించేవాని సాక్షిగా!' అని కూడా వివరించబడింది.

إِنَّ إِلَٰهَكُمۡ لَوَٰحِدٞ

నిశ్చయంగా, మీ ఆరాధ్య దైవం కేవలం ఆయన (అల్లాహ్) ఒక్కడే!

Explanation & meanings · 1
  1. పై మూడు ఆయతులలో దైవదూత ('అ.స.)ల వివిధ కార్యాలు వివరించబడ్డాయి. ప్రతిదీ అల్లాహ్ (సు.తా.) యొక్క సృష్టి మరియు ఆయనకు చెందినదే. కావున ఆయన తాను కోరిన దాని ప్రమాణం చేస్తాడు. కాని మానవులకు అల్లాహ్ (సు.తా.) తప్ప ఇతరుల ప్రమాణం చేయటం నిషిద్ధం ('హరాం) ఎందుకంటే ప్రమాణం తీసుకునే దానిని సాక్షిగా తీసుకోవలసి ఉంటుంది. మానవునికి అల్లాహ్ (సు.తా.) తప్ప మరొక ఉత్తమ సాక్షి లేడు. ఎందుకంటే కేవలం అల్లాహ్ (సు.తా.) యే సర్వసాక్షి.

رَّبُّ ٱلسَّمَٰوَٰتِ وَٱلۡأَرۡضِ وَمَا بَيۡنَهُمَا وَرَبُّ ٱلۡمَشَٰرِقِ

ఆకాశాలు మరియు భూమి మరియు వాటి మధ్యనున్న వాటి ప్రభువు మరియు సూర్యోదయ (తూర్పు) స్థలాలకు ప్రభువు.

Explanation & meanings · 1
  1. చూడండి, 55:17. అక్కడ రెండు తూర్పులు మరియు రెండు పడమరలు అని ఉంది. అంటే చలికాలం మరియు వేసవి కాలంలో సూర్యోదయం మరియు సూర్యాస్తమయం అయ్యే రెండు చివరలు. వాస్తవానికి సంవత్సరపు ప్రతి రోజున సూర్యుడు ఒక క్రొత్త చోటునుండి ఉదయిస్తాడు మరియు ఒక క్రొత్త చోటులో అస్తమిస్తాడు (ఫ'త్హ్ అల్-ఖదీర్).