Skip to content
الصَّافَات /

ఆయత్ 113

37 : 113

ఆయత్ 113 of الصَّافَات (37 : 113). This page carries the verse in the Uthmani script with a translation of its meaning, at a stable URL that can be cited on its own.

الصَّافَات ఆయతులు 182
సూరా · الصَّافَات
తెలుగు · Muhammad
37 : 113

وَبَٰرَكۡنَا عَلَيۡهِ وَعَلَىٰٓ إِسۡحَٰقَۚ وَمِن ذُرِّيَّتِهِمَا مُحۡسِنٞ وَظَالِمٞ لِّنَفۡسِهِۦ مُبِينٞ

మరియు మేము అతనిని (ఇబ్రాహీమ్ ను) మరియు ఇస్ హాఖ్ ను అనుగ్రహించాము. మరియు వారి సంతతిలో కొందరు సజ్జనులుండే వారు. మరికొందరు తమకు తాము స్పష్టంగా అన్యాయం చేసుకున్నవారు కూడా ఉన్నారు.

Explanation & meanings · 1
  1. అల్లాహ్ (సు.తా.) ఆజ్ఞతో, ఇ'స్హాఖ్ ('అ.స.) పుట్టక ముందే, ఇబ్రాహీమ్ ('అ.స.) తన రెండవ భార్య హాజర్ మరియు ఆమె కుమారుడు ఇస్మా'యీల్ ('అలైహిమ్ స.) లను మక్కాలో వదిలారు. ఇస్మా'యీల్ ('అ.స.) అక్కడ జుర్హుమ్ అనే 'అరబ్బు తెగ స్త్రీతో వివాహం చేసుకొని అక్కడే నివసిస్తూ 'అరబ్బులలో కలిసిపోయి 'అరబ్బు అయిపోయారు. అతని వంశంలో నుండి కేవలం ము'హమ్మద్ ('స'అస) మాత్రమే ప్రవక్తగా ఎన్నుకోబడ్డారు. ఇర ఇస్హా'ఖ్ ('అ.స.) కుమారుడు య'అఖూబ్ ('అ.స.) అతని మరొకపేరు ఇస్రాయీ'ల్. అదే పేరుతో అతని కుటుంబం వారు బనీ-ఇస్రాయీ'ల్ అనబడ్డారు. అతనికి 12 మంది కుమారులు. ప్రతి కుమారుని సంతతి నుండి ఒక బనీ-ఇస్రాయీ'ల్ తెగ ఏర్పడింది. యూసుఫ్ ('అ.స.) ఆ పన్నెండు కుమారులలో ఒకరు. బనీ-ఇస్రాయీ'ల్ సంతతిలో నుండి చాలా మంది ప్రవక్తలు వచ్చారు. మూసా మరియు 'ఈసా ('అలైహిమ్ స.) లు కూడా వారి సంతతిలోని వారే! ఈ రెండు ప్రవక్తల సంతతిలో మంచి వారు పుట్టారు. ముష్రికులు కూడా పుట్టారు. కావున కేవలం తండ్రి తాతలు పుణ్యపురుషులు అయినంత మాత్రాన సంతానంలో అందరూ పుణ్యవంతులవటం తప్పనిసరి కాదు!