Skip to content
సూరాల జాబితా /

يسٓ

يسٓ is chapter 36 of the Quran and has 83 verses. This page presents it in full in the Uthmani script, with a verse-by-verse translation of its meaning.

83 ఆయతులు సూరా సంఖ్య 36
ఆయత్‌కు వెళ్ళండి
తెలుగు · Muhammad
بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَٰنِ ٱلرَّحِيمِ

يسٓ

యా సీన్!

Explanation & meanings · 2
  1. సూరతుల్ బఖరహ్ లోని మొదటి ఆయతు యొక్క ఫుట్‌నోట్ చూడండి.
  2. యా-సీన్, ఈ రెండు అక్షరాలు కూడా, ఇతర అక్షరాల వలె ముఖత్తఆత్ లలోనివే! కావున వీటి నిజ అర్థం ఎవరికీ తెలియదు. కొందరు దీని అర్థం: 'ఓ మానవుడా!' అని అంటారు. మరికొందరు: 'ఇది దైవప్రవక్తను సంబోధిస్తుంది' అని అంటారు.

وَٱلۡقُرۡءَانِ ٱلۡحَكِيمِ

వివేకంతో నిండి ఉన్న ఖుర్ఆన్ సాక్షిగా!

إِنَّكَ لَمِنَ ٱلۡمُرۡسَلِينَ

(ఓ ముహమ్మద్!) నిశ్చయంగా, నీవు సందేశహరులలో ఒకడవు.

Explanation & meanings · 1
  1. మక్కా ముష్రికులు: 'నీవు దైవప్రవక్తవు కావు!' అని ము'హమ్మద్ ('స'అస) తో అనేవారు. చూడండి, 13:43. దానికి జవాబుగా ఈ ఆయత్ అవతరింపజేయబడింది.

عَلَىٰ صِرَٰطٖ مُّسۡتَقِيمٖ

(నీవు) ఋజుమార్గంపై ఉన్నావు.

تَنزِيلَ ٱلۡعَزِيزِ ٱلرَّحِيمِ

ఇది (ఈ ఖుర్ఆన్) సర్వశక్తిమంతుడు, అపార కరుణా ప్రదాత ద్వారానే అవతరింపజేయబడింది.

Explanation & meanings · 1
  1. చూడండి, 34:50.