“(ఒకసారి) మేము ఉమర్ రజియల్లాహు అన్హు వద్ద ఉన్నాము. అపుడు ఆయన ఇలా అన్నారు “అత్-తకల్లఫి చేయుట నుండి మనలను నిషేధించుట జరిగింది” (అత్-తకల్లుఫ్ التَّكَلُّفِ అంటే ‘ఎవరైనా, తాను నిజంగా అనుభూతి చెందని విషయాన్ని, అనుభూతి చెందినట్లు ఉద్దేశ్యపూర్వకంగా ప్రదర్శించుట)
అనస్ రజియల్లాహు అన్హు ఇలా ఉల్లేఖనం :
“(ఒకసారి) మేము ఉమర్ రజియల్లాహు అన్హు వద్ద ఉన్నాము. అపుడు ఆయన ఇలా అన్నారు “అత్-తకల్లఫి చేయుట నుండి మనలను నిషేధించుట జరిగింది” (అత్-తకల్లుఫ్ التَّكَلُّفِ అంటే ‘ఎవరైనా, తాను నిజంగా అనుభూతి చెందని విషయాన్ని, అనుభూతి చెందినట్లు ఉద్దేశ్యపూర్వకంగా ప్రదర్శించుట)
كُنَّا عِنْدَ عُمَرَ فَقَالَ: «نُهِينَا عَنِ التَّكَلُّفِ».
ఇందులో ఉమర్ రజియల్లాహు అన్హు: “అవసరం లేకపోయినా, ఎదుటివారిని ఆకట్టుకోవడానికి తాను ఎక్కువ కష్టపడుతున్నట్లుగా ఉద్దేశ్యపూర్వకముగా మాట్లాడుటను, అలాగే అవసరం లేకపోయినా ఆచరణలలోనూ ఉద్దేశ్యపూర్వకముగా చేయుటను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నిషేధించినారని” ఉల్లేఖించినారు.
...:
‘తాను నిజంగా అనుభూతి చెందని విషయాన్ని, అనుభూతి చెందినట్లు ఉద్దేశ్యపూర్వకంగా ప్రదర్శించుటకు’ (అత్-తకల్లుఫ్ التَّكَلُّفِ) చెందిన విషయాలు ఏమిటంటే – ఎక్కువగా ప్రశ్నించడం, లేదా తనకు ఏమాత్రమూ ఙ్ఞానము లేని విషయములో ఎక్కువ కష్టపడుతున్నట్లు ప్రదర్శించడం, లేదా ఏదైనా విషయానికి సంబంధించి అల్లాహ్ అన్ని విధాలుగా సమృద్ధిగా సామర్థ్యము ప్రసాదించినప్పటికీ, అవసరం లేకపోయినా ఆ విషయమును ఆచరించుటలో ఎక్కువగా కష్టపడే కఠిన వైఖరిని అవలంబించుట.
ఇందులో – ప్రతి ముస్లిం, తన మాటలలో గానీ, లేక ఆచరణలలో గానీ ఎదుటివారిని ఆకట్టుకోవడానికి ఎక్కువ కష్టపడుతున్నట్టు చూపించడం అనే అల్ప వైఖరి నుండి తనను తాను ఆపుకోవాలి, ప్రతి విషయములోనూ, ఉదా: తినుట, త్రాగుట, మాలాడుట మొదలైన ఇతర అన్ని విషయాలలోనూ, ఉదాత్తతను అలవాటు చేసుకోవాలి
ఇస్లాం సౌలభ్యతను కలిగి యున్న ధర్మము (అంటే తనను అనుసరించుటలో సౌలభ్యమును కలిగి యున్న ధర్మము).
సహీహ్ అల్ బుఖారీ. (9/ 95) (7293).
ఇంకా (10)
نزهة المتقين.
لمصطفى الخن وغيره (2/ 1136).
شرح رياض الصالحين.
لابن عثيمين (6/ 391).
فتح الباري شرح صحيح البخاري.
لابن حجر (13/ 270).
النهاية في غريب الحديث والأثر.
لابن الأثير (4/ 196).
تطريز رياض الصالحين.
لفيصل آل مبارك (ص930).