عربي - Arabic English Qafár af - Afar Afrikaans - Afrikanns Akan Shqip - Albanian አማርኛ - Amharic Հայերեն - Armenian অসমীয়া - Assamese Azərbaycanca - Azerbaijani Bamanankan - Bambara Bassa Bemba বাংলা - Bengali Bosanski - Bosnian Български - Bulgarian မြန်မာဘာသာ - Burmese Bisaya - Cebuano Cham Нохчий - Chechen chiCheŵa - Chewa 中文 - Chinese Адыгэбзэ - Circassian Hrvatski - Croatian Česky - Czech Dagbani Dansk - Danish فارسی دری - Dari Dendi ދިވެހި ބަސް - Dhivehi Nederlands - Dutch إستوني - Estonian Suomi - Finnish Français - French Fulfulde - Fula ქართული - Georgian Deutsch - German Ελληνικά - Greek ગુજરાતી - Gujrati Kreyòl ayisyen - Haitian Creole Hausa हिन्दी - Hindi Magyar - Hungarian Igbo Indonesia - Indonesian Italiano - Italian 日本語 - Japanese Jóola - Jola ಕನ್ನಡ - Kannada Қазақша - Kazakh ភាសាខ្មែរ - Khmer Kikuyu Ikinyarwanda - Kinyarwanda Ikirundi - Kirundi 한국어 - Korean كوردی سۆرانی - kurdish كوردي kurmancî - Kurmanji Kyrgyz ລາວ - Lao latviešu - Latvian Lingala lietuvių - Lithuanian Luganda Македонски - Macedonian Maguindanaon Malagasy - Malagasy Bahasa Melayu - Malay മലയാളം - Malayalam Mandinka मराठी - Marathi Mõõré - Moore नेपाली - Nepali أنكو - NKo Norwegian ଓଡ଼ିଆ - Odia oromoo - Oromo پښتو - Pashto فارسی - Persian Polski - Polish Portuguese ਪੰਜਾਬੀ - Punjabi Română - Romanian Русский - Russian Српски - Serbian Shona සිංහල - Sinhala Slovenščina - Slovenian Soomaaliga - Somali Soninke Sesotho - Sotho Español - Spanish Kiswahili - Swahili Svenska - Swedish Tagalog Тоҷикӣ - Tajik தமிழ் - Tamil తెలుగు - Telugu ไทย - Thai ትግረኛ - Tigrinya Türkçe - Turkish Ukrainian اردو - Urdu ئۇيغۇرچە - Uyghur Ўзбек - Uzbek Việt Nam - Vietnamese Wolof Yao Yorùbá - Yoruba Zarma زولو - Zulu
842 హదీసులు
ప్రవక్త హదీసుల విజ్ఞాన సర్వస్వం
Filter results
842 cards
Grading
Narrated in
Show remaining sources
Narrator
Show all narrators (235)
"మీరు అల్లాహ్ పై సంపూర్ణంగా ఆధారపడినట్లయితే, ఆయన పక్షులకు ఆహారాన్ని ఇచ్చే విధంగానే మీకు కూడా ఇస్తాడు. అవి ఉదయం ఖాళీ కడుపుతో బయలుదేరి, సాయంత్రం నిండిన కడుపుతో తిరిగి వస్తాయి."ఏర్పాటు
Sahih al-Tirmidhi, al-Nasa'i, Ibn Majah, Ahmad, Ibn Hibban, al-Hakim
"పుణ్యం (అల్-బిర్ర్) అంటే మంచి ప్రవర్తన, మరియు పాపం (అల్-ఇథమ్) అంటే నీ హృదయంలో సందేహాన్ని కలిగించి, దానిని ప్రజలు తెలుసుకోవడాన్ని నీవు ఇష్టపడనిది."
Sahih Muslim, Ahmad, al-Darimi
ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తనను యమన్‌కు పంపినప్పుడు, ఆయనను అక్కడ తయారుచేసే కొన్ని పానీయాల గురించి అడిగాడు. దానికి ప్రవక్త ఇలా అడిగారు: "అవి ఏమిటి?" అతను ఇలా సమాధానమిచ్చాడు: "అల్-బిత్' మరియు అల్-మిజ్ర్." అప్పుడు అబూ బుర్దాను అల్-బిత్' అంటే ఏమిటని అడిగారు, అతను ఇలా చెప్పాడు: తేనెతో తయారు చేసిన రసం, మరియు అల్-మిజ్ర్ అంటే బార్లీతో తయారు చేసిన రసం. అప్పుడు ప్రవక్త ఇలా అన్నారు: "మత్తు కలిగించే ప్రతిదీ నిషిద్ధం (హరామ్)." దీనిని బుఖారీ ఉల్లేఖించారు.
Sahih al-Bukhari, Muslim
"నీ నాలుక అల్లాహ్ యొక్క స్మరణతో తడిగా (సజీవంగా) ఉండేలా చూసుకో."
Sahih al-Tirmidhi, Ibn Majah, Ahmad, Ibn Hibban
"నాలుగు లక్షణాలు ఎవరిలో ఉంటాయో, అతను కపటివాడు అవుతాడు. ఒకవేళ వాటిలో ఒక లక్షణం అతనిలో ఉంటే, అతను దానిని విడిచిపెట్టే వరకు అతనిలో కపటత్వపు ఒక లక్షణం ఉన్నట్లే. ఆ లక్షణాలు ఏమిటంటే: అతను మాట్లాడితే అబద్ధం చెబుతాడు, వాగ్దానం చేస్తే దానికి విరుద్ధంగా ప్రవర్తిస్తాడు, వాగ్దానం చేస్తే దానిని భంగం చేస్తాడు, మరియు ఒప్పందం చేసుకుంటే మోసం చేస్తాడు."
Sahih al-Bukhari, Muslim
“ప్రపంచపు చివరి కాలము లో, వయస్సులో చిన్నవారు మరియు బుద్ధిలో మూర్ఖులు అయిన ఒక ప్రజ పుట్టుకొస్తుంది. వారు (తమ వాదనలో) అందరికంటే ఉత్తమమైన ప్రసంగాన్ని (అంటే ఖురాన్) ఉపయోగిస్తారు; వేట జంతువు శరీరం నుండి బాణం దూసుకు పోయిన విధంగా వారు ఇస్లాం నుండి వెళ్ళిపోతారు. వారి విశ్వాసం వారి గొంతులను దాటి వెళ్ళదు. మీరు వారిని ఎక్కడ ఎదుర్కొన్నా, వారిని చంపండి, ఎందుకంటే వారిని చంపడం, తీర్పు దినమున, వారిని చంపిన వారికి ప్రతిఫలం గా మారుతుంది.”
Sahih al-Bukhari, Muslim
“అల్లాహ్ స్వర్గమును మరియు నరకమును సృష్టించినపుడు, జిబ్రయీల్ అలైహిస్సలాం ను స్వర్గము వైపునకు పంపుతూ ఇలా అన్నాడు “దానిని చూడు, మరియు దాని నివాసుల కొరకు నేను ఏమేమి తయారు చేసి ఉంచానో కూడా చూడు”. ఆయన స్వర్గానికి వెళ్ళి దానిని చూసాడు, మరియు అల్లాహ్ అందులో ఏమేమి తయారు చేసి ఉంచినాడో చూస్తాడు. (తిరిగి వచ్చి) జిబ్రయీల్ అలైహిస్సలాం ఇలా అంటాడు “నీ ఘనత సాక్షిగా, దాని గురించి విన్న వారు ఎవరైనా దాని లోనికి ప్రవేశించాలని తప్ప మరేమీ కోరుకోరు.” అల్లాహ్ తన ఆదేశముతో స్వర్గాన్ని (స్వర్గంలో చేరే మార్గాన్ని) కఠిన పరిస్థితులు, కష్టాలు, కడగండ్లు, శ్రమ, ప్రయాస మొదలైనవి చుట్టుకుని ఉండేలా చేసాడు. అపుడు (జిబ్రయీల్ అలైహిస్సలాంతో) అల్లాహ్ ఇలా అన్నాడు “తిరిగి వెళ్ళు, దానిని చూడు, మరియు దాని నివాసుల కొరకు నేను ఏమేమి తయారు చేసి ఉంచానో కూడా చూడు.” కనుక ఆయన (జిబ్రయీల్) స్వర్గానికి తిరిగి వెళ్ళాడు. స్వర్గము కఠిన పరిస్థితులు, కష్టాలు, కడగండ్లతో చుట్టుకుని ఉండడం చూసాడు. అతడు అల్లాహ్ వద్దకు వచ్చి ఇలా అన్నాడు “నీ ఘనత సాక్షిగా, ఎవరూ అందులోనికి ప్రవేశించలేరు.” అపుడు అల్లాహ్ ఆయనతో “నరకానికి వెళ్ళు, దానిని చూడు, మరియు దాని నివాసుల కొరకు నేను ఏమేమి తయారు చేసి ఉంచానో కూడా చూడు” అన్నాడు. ఆయన దానిని వెళ్ళి చూసాడు. (అది ఎన్నో భాగాలుగా ఉంది) దాని ఒక భాగము మరొక భాగముపై పేర్చబడి ఉన్నది. ఆయన తిరిగి వచ్చి “నీ ఘనత సాక్షిగా, ఎవరూ దానిలోనికి ప్రవేశించరు” అన్నాడు. అపుడు అల్లాహ్ తన ఆదేశముతో నరకాన్ని వాంఛలు, కోరికలు మొదలైనవి చుట్టుకుని ఉండేలా చేసాడు. తరువాత జిబ్రయీల్ అలైహిస్సలాంతో అల్లాహ్ ఇలా అన్నాడు “తిరిగి వెళ్ళు, దానిని చూడు, మరియు దాని నివాసుల కొరకు నేను ఏమేమి తయారు చేసి ఉంచానో కూడా చూడు.” ఆయన వెళ్ళి దానిని చూసాడు. అది వాంఛలు, కోరికలతో ఆవరించబడి ఉన్నది. ఆయన తిరిగి వచ్చి “నీ ఘనత సాక్షిగా! అందులోనికి వెళ్ళి పడిపోవడం తప్ప, దాని నుండి ఎవరూ తప్పించుకోలేరు అని భయంగా ఉన్నది” అన్నాడు.
Hasan Abu Dawud, al-Tirmidhi, al-Nasa'i
"ఎవరైతే ఒక విశ్వాసిని ఈ ప్రాపంచిక కష్టాలలోని ఒక కష్టం నుండి విముక్తి చేస్తారో, ప్రళయ దినాన అల్లాహ్ అతడిని ఒక కష్టం నుండి విముక్తి చేస్తాడు. ఎవరైతే ఒక కష్టంలో ఉన్నవారి కష్టాన్ని సులభతరం చేస్తాడో, అల్లాహ్ ఈ ప్రపంచంలోనూ, పరలోకంలోనూ అతని కష్టాన్ని సులభతరం చేస్తాడు. ఎవరైతే తోటి ముస్లిం లోపాలను దాచిపెడతారో, అల్లాహ్ ఈ ప్రపంచంలోనూ, పరలోకంలోనూ అతని లోపాల్ని దాచి పెడతాడు. అల్లాహ్ యొక్క దాసుడు (ముస్లిం) తన తోటి సోదరునికి సహాయం చేస్తున్నంత కాలం, అల్లాహ్ కూడా ఆ దాసుడికి సహాయం చేస్తాడు. ఎవరైతే జ్ఞానం అన్వేషించే మార్గంలో నడుస్తారో, అల్లాహ్ అతనికి స్వర్గానికి చేర్చే మార్గాన్ని సులభతరం చేస్తాడు. అల్లాహ్ యొక్క గృహాలలో (మస్జిదులలో) నుండి ఒక గృహంలో ప్రజల సమూహం ఒక చోట చేరి, అల్లాహ్ గ్రంథాన్ని పఠిస్తూ, దాన్ని తమలో తాము అధ్యయనం చేస్తుంటే, అల్లాహ్ యొక్క ప్రశాంతత ఆ సమూహంపై వర్షిస్తుంది, ఆయన దయ వారిని ఆవరిస్తుంది, దైవదూతలు వారిని చుట్టుముట్టుతారు మరియు అల్లాహ్ తన సన్నిధిలో ఉన్న వారితో, ఆ సమూహం గురించి ప్రస్తావిస్తాడు. మరియు ఎవరి కర్మలు వారిని వెనుకబడేలా చేస్తాయో, వారి వంశం కూడా వారిని ముందుకు తీసుకు రాలేదు."
Sahih Muslim