Skip to content
సూరాల జాబితా /

الذَّاريَات

الذَّاريَات is chapter 51 of the Quran and has 60 verses. This page presents it in full in the Uthmani script, with a verse-by-verse translation of its meaning.

60 ఆయతులు సూరా సంఖ్య 51
ఆయత్‌కు వెళ్ళండి
తెలుగు · Muhammad
بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَٰنِ ٱلرَّحِيمِ

وَٱلذَّٰرِيَٰتِ ذَرۡوٗا

దుమ్ము ఎగురవేసే వాటి (గాలుల) సాక్షిగా!

فَٱلۡحَٰمِلَٰتِ وِقۡرٗا

మరియు (నీటి) భారాన్ని మోసే (మేఘాల);

فَٱلۡجَٰرِيَٰتِ يُسۡرٗا

మరియు సముద్రంలో సులభంగా తేలియాడే (ఓడల);

فَٱلۡمُقَسِّمَٰتِ أَمۡرًا

మరియు (ఆయన) ఆజ్ఞతో (అనుగ్రహాలను) పంచిపెట్టే (దేవదూతల సాక్షిగా);

Explanation & meanings · 1
  1. సాక్షిగా అంటే ఇక్కడ నొక్కి చెప్పడం అన్నట్లు. లేక ఉదాహరణగా ఇవ్వటం. ఏ విధంగానైతే గాలులు, మేఘాలు, నీటపై ఓడలు పయనించటం ఎంత సత్యమో పునరుత్థానం కూడా సత్యం.

إِنَّمَا تُوعَدُونَ لَصَادِقٞ

నిశ్చయంగా, మీకు చేయబడ్డ వాగ్దానం సత్యం.