Skip to content
సూరాల జాబితా /

الطُّور

الطُّور is chapter 52 of the Quran and has 49 verses. This page presents it in full in the Uthmani script, with a verse-by-verse translation of its meaning.

49 ఆయతులు సూరా సంఖ్య 52
ఆయత్‌కు వెళ్ళండి
తెలుగు · Muhammad
بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَٰنِ ٱلرَّحِيمِ

وَٱلطُّورِ

తూర్ పర్వతం సాక్షిగా!

Explanation & meanings · 1
  1. ఈ 'తూర్ పర్వతం మీదనే మూసా ('అ.స.) అల్లాహ్ (సు.తా.) తో మాట్లాడారు. దీని మరొక పేరు 'తూర్ సినాయి అని కూడా ఉంది.

وَكِتَٰبٖ مَّسۡطُورٖ

వ్రాయబడిన గ్రంథం సాక్షిగా!

فِي رَقّٖ مَّنشُورٖ

విప్పబడిన చర్మపత్రం మీద.

Explanation & meanings · 1
  1. రఖ్ఖిన్: Parchment, అంటే రాతకు అనువయ్యేటట్లు పదును చేసిన గొర్రెతోలు, చర్మపత్రం, చర్మపత్ర రాతప్రతి.

وَٱلۡبَيۡتِ ٱلۡمَعۡمُورِ

చిరకాల సందర్శనాలయం సాక్షిగా!

Explanation & meanings · 1
  1. బైతుల్-మ'అమూర్: ఏడవ ఆకాశం మీద ఉన్న ఆలయం. అక్కడ దైవదూతలు అల్లాహ్ (సు.తా.) ఆరాధన చేస్తూ ఉంటారు. ప్రతిరోజూ అక్కడికి డెబ్భై వేల దైవదూతలు ఆరాధన కోసం వస్తారు. అయినా వారికి పునరుత్థానదినం వరకూ రెండవ సారి దాని దర్శనం చేసే అవకాశం దొరకదు. మ'అమూర్ అంటే నిండి ఉన్న ప్రదేశం. కాబట్టి కొందరు వ్యాఖ్యాతలు బైతుల్-మ'అమూర్ అంటే మక్కాలోని కాబా అని, కూడా అంటారు. ఎందుకంటే అది కూడా ఎల్లప్పుడు అక్కడికి ఆరాధన కొరకు వచ్చే ప్రజలతో నిండి ఉంటుంది.

وَٱلسَّقۡفِ ٱلۡمَرۡفُوعِ

పైకెత్తబడిన కప్పు (అంతరిక్షం) సాక్షిగా!

Explanation & meanings · 1
  1. చూడండి, 21:32.