Skip to content
సూరాల జాబితా /

قٓ

قٓ is chapter 50 of the Quran and has 45 verses. This page presents it in full in the Uthmani script, with a verse-by-verse translation of its meaning.

45 ఆయతులు సూరా సంఖ్య 50
ఆయత్‌కు వెళ్ళండి
తెలుగు · Muhammad
بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَٰنِ ٱلرَّحِيمِ

قٓۚ وَٱلۡقُرۡءَانِ ٱلۡمَجِيدِ

ఖాఫ్, మరియు దివ్యమైన ఈ ఖుర్ఆన్ సాక్షిగా!

Explanation & meanings · 2
  1. సూరతుల్ బఖరహ్ లోని మొదటి ఆయతు యొక్క ఫుట్‌నోట్ చూడండి.
  2. అల్ మజీదు: ఖుర్ఆన్ ను సంబోధించిన సందర్భానికి చూడండి, 85:21. Glorious, Noble, దివ్యమైన, ఉత్కృష్టమైన. అల్లాహు'తాలాను సంబోధించిన సందర్భానికి చూడండి, 11:73, 85:15. మహత్వపూర్ణుడు

بَلۡ عَجِبُوٓاْ أَن جَآءَهُم مُّنذِرٞ مِّنۡهُمۡ فَقَالَ ٱلۡكَٰفِرُونَ هَٰذَا شَيۡءٌ عَجِيبٌ

అలా కాదు! హెచ్చరిక చేసేవాడు, వారి వద్దకు వారిలో నుంచే వచ్చాడనే విషయం వారికి ఆశ్చర్యం కలిగించింది, కావున సత్యతిరస్కారులు ఇలా అన్నారు: "ఇది ఆశ్చర్యకరమైన విషయం!

Explanation & meanings · 1
  1. చూడండి, 25:7, 20.

أَءِذَا مِتۡنَا وَكُنَّا تُرَابٗاۖ ذَٰلِكَ رَجۡعُۢ بَعِيدٞ

మేము మరణించి మట్టిగా మారి పోయినా (మరల బ్రతికించ బడతామా)? ఈ విధంగా మరల (సజీవులై) రావటం చాలా అసంభవమైన విషయం!"

قَدۡ عَلِمۡنَا مَا تَنقُصُ ٱلۡأَرۡضُ مِنۡهُمۡۖ وَعِندَنَا كِتَٰبٌ حَفِيظُۢ

వాస్తవానికి వారి (శరీరాల)లో నుండి భూమి దేనిని తగ్గిస్తుందో మాకు బాగా తెలుసు. మరియు మా దగ్గర అంతా ఒక సురక్షితమైన గ్రంథంలో (వ్రాయబడి) ఉంది.

Explanation & meanings · 1
  1. పునరుత్థానం అంటే పూర్తిగా దుమ్ము ధూళిగా మారిపోయిన మానవులను తిరిగి మొదటి రూపంలో బ్రతికించి తీసుకురావటం. చూడండి, 10:4, 21:104, 30:11, 85:13 మొదలైనవి. ఇంకా చూడండి, 10:34, 27:64, 30:27.

بَلۡ كَذَّبُواْ بِٱلۡحَقِّ لَمَّا جَآءَهُمۡ فَهُمۡ فِيٓ أَمۡرٖ مَّرِيجٍ

కాని వారు, సత్యం వారి వద్దకు వచ్చినపుడు దానిని అసత్యమని తిరస్కరించారు. కాబట్టి వారు ఈ విషయం గురించి కలవరపడుతున్నారు.