Skip to content
الذَّاريَات /

ఆయత్ 36

51 : 36

ఆయత్ 36 of الذَّاريَات (51 : 36). This page carries the verse in the Uthmani script with a translation of its meaning, at a stable URL that can be cited on its own.

الذَّاريَات ఆయతులు 60
సూరా · الذَّاريَات
తెలుగు · Muhammad
51 : 36

فَمَا وَجَدۡنَا فِيهَا غَيۡرَ بَيۡتٖ مِّنَ ٱلۡمُسۡلِمِينَ

మేము అందు ఒక్క గృహం తప్ప! ఇతర విధేయుల (ముస్లింల) గృహాన్ని చూడలేదు.

Explanation & meanings · 2
  1. ఆ ఇల్లు లూ'త్ ('అ.స.) యొక్క ఇల్లు. అతని ఇద్దరు కుమార్తెలు మరియు కొంతమంది విశ్వాసులు. అంతా కలసి దాదాపు 13 మంది మాత్రమే ఉంటారు. లూ'త్ ('అ.స.) భార్య వారితో చేరక, సత్యతిరస్కారులలో చేరిపోతుంది.
  2. ఒకరు దైవప్రవక్త ('స'అస) ను ప్రశ్నిస్తారు: 'ఇస్లాం అంటే ఏమిటి?' అతను ('స'అస) అంటారు: '1) లా ఇలాహ ఇల్లల్లాహ్ (షహాదహ్) సాక్ష్యం పలకడం, 2) నమా'జ్ స్థాపించడం, 3) 'జకాత్ ఇవ్వడం, 4) రమజాన్ నెలలో ఉపవాసముండడం మరియు 5) 'హజ్ చేయడం' అని అంటారు, తరువాత 'ఈమాన్ అంటే ఏమిటి?' అని ప్రశ్నిస్తే, అతను ('స'అస) అంటారు: '1) అల్లాహ్ (సు.తా.)ను విశ్వసించడం, 2) ఆయన దూతలను, 3) దివ్యగ్రంథాలను, 4) ప్రవక్తలను, 5) పునరుత్థాన దినాన్ని మరియు 6) ఖద్ర్ (మంచి లేక చెడు ఏది సంభవించినా అల్లాహ్ తరఫునుండేనని) విశ్వసించడం.' అంటే హృదయపూర్వకంగా ఈ విషయాలను నమ్మడమే ఈమాన్. అల్లాహ్ (సు.తా.) ఆజ్ఞలను మరియు విధులను పాటించడం ఇస్లాం. దీని ప్రకారం ప్రతి మూ'మిన్ ముస్లిం మరియు ప్రతి ముస్లిం మూ'మిన్. (ఫ'త్హ్ అల్-ఖదీర్). ఇక ఎవరైతే మూ'మిన్ మరియు ముస్లింల మధ్య వ్యత్యాసం చూపుతారో, వారు అంటారు: 'ఖుర్ఆన్ లో ఇక్కడ ఒకే రకమైన జనుల కొరకు మూ'మిన్ మరియు ముస్లిం శబ్దాలు వాడబడ్డాయి. కాని వీటి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని బట్టి ప్రతి మూ'మిన్ ముస్లిం అవుతాడు. కానీ ప్రతి ముస్లిం మూ'మిన్ అవటం అనివార్యం కాదు.' ఇబ్నె-కసీ'ర్, (వివరాలకు ము'హమ్మద్ జులాగఢి-పేజీ, 1478, మలిక్ ఫహద్ ఖుర్ఆన్ ప్రింటింగ్ కాంప్లెక్సు, మదీన మునవ్వరహ్).