Skip to content
సూరాల జాబితా /

القَصَص

القَصَص is chapter 28 of the Quran and has 88 verses. This page presents it in full in the Uthmani script, with a verse-by-verse translation of its meaning.

88 ఆయతులు సూరా సంఖ్య 28
ఆయత్‌కు వెళ్ళండి
తెలుగు · Muhammad
بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَٰنِ ٱلرَّحِيمِ

طسٓمٓ

తా-సీన్-మీమ్.

Explanation & meanings · 1
  1. సూరతుల్ బఖరహ్ లోని మొదటి ఆయతు యొక్క ఫుట్‌నోట్ చూడండి.

تِلۡكَ ءَايَٰتُ ٱلۡكِتَٰبِ ٱلۡمُبِينِ

ఇవి స్పష్టమైన గ్రంథ సూచనలు (ఆయాత్).

Explanation & meanings · 1
  1. చూడండి, 12:1.

نَتۡلُواْ عَلَيۡكَ مِن نَّبَإِ مُوسَىٰ وَفِرۡعَوۡنَ بِٱلۡحَقِّ لِقَوۡمٖ يُؤۡمِنُونَ

విశ్వసించే ప్రజల కొరకు, మేము మూసా మరియు ఫిర్ఔన్ ల యొక్క నిజ వృత్తాంతాన్ని నీకు వినిపిస్తున్నాము.

إِنَّ فِرۡعَوۡنَ عَلَا فِي ٱلۡأَرۡضِ وَجَعَلَ أَهۡلَهَا شِيَعٗا يَسۡتَضۡعِفُ طَآئِفَةٗ مِّنۡهُمۡ يُذَبِّحُ أَبۡنَآءَهُمۡ وَيَسۡتَحۡيِۦ نِسَآءَهُمۡۚ إِنَّهُۥ كَانَ مِنَ ٱلۡمُفۡسِدِينَ

నిశ్చయంగా, ఫిర్ఔన్ భూమి మీద అహంకారంతో ప్రవర్తిస్తూ ఉండేవాడు. మరియు అందులోని ప్రజలను వర్గాలుగా విభజించి, వారిలోని ఒక తెగ వారిని నీచపరచి వారి పుత్రులను వధిస్తూ ఉండేవాడు మరియు వారి స్త్రీలను బ్రతకనిచ్చేవాడు. నిశ్చయంగా, అతడు దౌర్జన్యపరులలోని వాడిగా ఉండేవాడు.

Explanation & meanings · 1
  1. వీరు ఇస్రాయీ'ల్ సంతతివారు. ఫిర్'ఔన్ జాతివారు వీరిని బానిసలుగా చేసి హింసించే వారు.

وَنُرِيدُ أَن نَّمُنَّ عَلَى ٱلَّذِينَ ٱسۡتُضۡعِفُواْ فِي ٱلۡأَرۡضِ وَنَجۡعَلَهُمۡ أَئِمَّةٗ وَنَجۡعَلَهُمُ ٱلۡوَٰرِثِينَ

మరియు భూమి మీద అణచి వేయబడిన వారిని కనికరించాలని మరియు వారిని నాయకులుగా చేయాలని మరియు వారిని వారసులుగా చేయాలని మేము కోరాము.

Explanation & meanings · 1
  1. చూడండి, 7:137.