28 : 77
وَٱبۡتَغِ فِيمَآ ءَاتَىٰكَ ٱللَّهُ ٱلدَّارَ ٱلۡأٓخِرَةَۖ وَلَا تَنسَ نَصِيبَكَ مِنَ ٱلدُّنۡيَاۖ وَأَحۡسِن كَمَآ أَحۡسَنَ ٱللَّهُ إِلَيۡكَۖ وَلَا تَبۡغِ ٱلۡفَسَادَ فِي ٱلۡأَرۡضِۖ إِنَّ ٱللَّهَ لَا يُحِبُّ ٱلۡمُفۡسِدِينَ
మరియు అల్లాహ్ నీకు ఇచ్చిన సంపదతో పరలోక గృహాన్ని పొందటానికి ప్రయత్నించు. మరియు ఇహలోకం నుండి లభించే భాగాన్ని మరచిపోకు. నీకు అల్లాహ్ మేలు చేసినట్లు, నీవు కూడా (ప్రజలకు) మేలు చేయి. భూమిపై కల్లోలం రేకెత్తించటానికి ప్రయత్నించకు. నిశ్చయంగా, అల్లాహ్ కల్లోలం రేకెత్తించేవారిని ప్రేమించడు!"
Explanation & meanings · 1
- ఏ విధంగానైతే నీ ప్రభువుకు నీపై హక్కు ఉందో, అదే విధంగా నీ ఆత్మకు, నీ భార్యాపిల్లలకు, నీ బంధువులకు మరయు నీ అతిథులను మొదలైన వారికి కూడా నీ మీద., నీ ఆదాయం మీద హక్కు ఉంది. కావున ప్రతి ఒక్కనికి వాని హక్కు చెల్లించు.