Skip to content
القَصَص /

ఆయత్ 59

28 : 59
القَصَص ఆయతులు 88
సూరా · القَصَص
తెలుగు · Muhammad
28 : 59

وَمَا كَانَ رَبُّكَ مُهۡلِكَ ٱلۡقُرَىٰ حَتَّىٰ يَبۡعَثَ فِيٓ أُمِّهَا رَسُولٗا يَتۡلُواْ عَلَيۡهِمۡ ءَايَٰتِنَاۚ وَمَا كُنَّا مُهۡلِكِي ٱلۡقُرَىٰٓ إِلَّا وَأَهۡلُهَا ظَٰلِمُونَ

మరియు నీ ప్రభువు నగరాలను ఏ మాత్రమూ నాశనం చేసేవాడు కాదు, ఎంత వరకైతే వాటి ముఖ్య నగరానికి మా సూచన (ఆయాత్) లను వినిపించే సందేశహరులను పంపమో! మేము నగరాలను వాటి ప్రజలు దుర్మార్గులై పోతే తప్ప, నాశనం చేసే వారం కాము.

Explanation & meanings · 1
  1. సందేశహరులు ఎల్లప్పుడూ పెద్ద నగరాలలోనే పంపబడ్డారు. వారే దాని చుట్టూ ఉన్న చిన్న గ్రామాల వారికి కూడా ప్రచారం చేశారు. కేవలం సత్యతిరస్కారులుగా ఉన్నంత మాత్రాన, ఏ నగరవాసులు కూడా నాశనం చేయబడలేదు. సత్యతిరస్కారంతో బాటు వాటిలోని ప్రజలు దుర్మార్గానికి, విశ్వాసుల పట్ల దౌర్జన్యానికి పాల్పడినప్పుడే అవి నాశనం చేయబడ్డాయి. చూడండి, 11:117, 6:130-132, 28:59.