28 : 54
أُوْلَٰٓئِكَ يُؤۡتَوۡنَ أَجۡرَهُم مَّرَّتَيۡنِ بِمَا صَبَرُواْ وَيَدۡرَءُونَ بِٱلۡحَسَنَةِ ٱلسَّيِّئَةَ وَمِمَّا رَزَقۡنَٰهُمۡ يُنفِقُونَ
వీరే, తమ సహనానికి ఫలితంగా రెండింతలు ప్రతిఫలమొసంగపడే వారు. వీరే మంచితో చెడును నివారించే వారు. మరియు మేము వారికిచ్చిన జీవనోపాధి నుండి ఖర్చు చేసేవారు.
Explanation & meanings · 1
- చూసహనం వహించటం అంటే, ఇక్కడ దైవప్రవక్తలను మరియు దివ్యగ్రంథాలను విశ్వసించి ఆ విశ్వాసంపై స్థిరంగా ఉండటం. మొదటి దివ్యగ్రంథం మీద స్థిరంగా ఉండి, రెండవ దివ్యగ్రంథం వస్తే దానిని అనుసరించటం. ఇలాంటి వారికి రెండింతలు ప్రతిఫలముంది. రెండింతలు ప్రతిఫలం పొందే ముగ్గురిలో వీరొకరు. ('స.బు'ఖారీ) చూ. 13:22.