Skip to content
القَصَص /

ఆయత్ 76

28 : 76
القَصَص ఆయతులు 88
సూరా · القَصَص
తెలుగు · Muhammad
28 : 76

۞ إِنَّ قَٰرُونَ كَانَ مِن قَوۡمِ مُوسَىٰ فَبَغَىٰ عَلَيۡهِمۡۖ وَءَاتَيۡنَٰهُ مِنَ ٱلۡكُنُوزِ مَآ إِنَّ مَفَاتِحَهُۥ لَتَنُوٓأُ بِٱلۡعُصۡبَةِ أُوْلِي ٱلۡقُوَّةِ إِذۡ قَالَ لَهُۥ قَوۡمُهُۥ لَا تَفۡرَحۡۖ إِنَّ ٱللَّهَ لَا يُحِبُّ ٱلۡفَرِحِينَ

వాస్తవానికి, ఖారూన్, మూసా జాతికి చెందినవాడే. కాని అతడు వారికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశాడు. మరియు మేము అతడికి ఎన్నో నిధులను ఇచ్చి ఉంటిమి. వాటి తాళవు చెవులను బలవంతులైన పది మంది లేదా అంతకంటే ఎక్కువ మంది కూడా ఎంతో కష్టంతో మాత్రమే మోయగలిగే వారు. అతడి జాతి వారు అతనితో అన్నారు: "నీవు విర్రవీగకు, నిశ్చయంగా, అల్లాహ్ విర్రవీగే వారిని ప్రేమించడు!

Explanation & meanings · 1
  1. చూఎంత గొప్ప ప్రవక్తను అనుసరించినా, అహంభావం మరియు స్వాభిమానంతో ప్రవర్తించే వారిని అల్లాహ్ (సు.తా.) ప్రేమించడు. ఈ ఉదాహరణ ఇక్కడ మూసా ('అ.స.) జాతికి చెందిన ఖారూన్ అనే గొప్ప ధనవంతుడైన వ్యక్తి విషయంలో ఇవ్వబడింది. ఇంకా చూడండి, 29:39 మరియు 40:24.