Skip to content
القَصَص /

ఆయత్ 27

28 : 27
القَصَص ఆయతులు 88
సూరా · القَصَص
తెలుగు · Muhammad
28 : 27

قَالَ إِنِّيٓ أُرِيدُ أَنۡ أُنكِحَكَ إِحۡدَى ٱبۡنَتَيَّ هَٰتَيۡنِ عَلَىٰٓ أَن تَأۡجُرَنِي ثَمَٰنِيَ حِجَجٖۖ فَإِنۡ أَتۡمَمۡتَ عَشۡرٗا فَمِنۡ عِندِكَۖ وَمَآ أُرِيدُ أَنۡ أَشُقَّ عَلَيۡكَۚ سَتَجِدُنِيٓ إِن شَآءَ ٱللَّهُ مِنَ ٱلصَّٰلِحِينَ

(వారి తండ్రి) అన్నాడు: "నీవు నా వద్ద ఎనిమిది సంవత్సరాలు పని చేస్తూ ఉండటానికి ఒప్పుకుంటే, నేను నా ఈ ఇద్దరు కుమార్తెలలో ఒకామెను నీకిచ్చి వివాహం చేయగోరుతున్నాను. నీవు ఒకవేళ పది సంవత్సరాలు పూర్తి చేయదలిస్తే అది నీ ఇష్టం! నేను నీకు కష్టం కలిగించ దలచుకోలేదు. అల్లాహ్ కోరితే, నీవు నన్ను సద్వర్తనునిగా పొందుతావు!"

Explanation & meanings · 1
  1. మన సాంఘిక సంప్రదాయంలో ఆడబిడ్డ (వధువు) ఇంటివారు తమ బిడ్డ కొరకు వరుని (పెండ్లి కుమారుని) వారితో వివాహసంబంధం గురించి మొదట మాట ప్రారంభించటం అనుచితమైన విషయంగా భావిస్తారు. కాని అల్లాహ్ (సు.తా.) షరీయత్ లో ఇది అనుచితం కాదు. ఒకవేళ సద్వర్తనుడు, సుశీలుడు అయిన వరుడు ఉంటే అతనితో గానీ, లేక అతని కుటుంబంవారితో గానీ, వధువు ఇంటివారు మాట్లాడితే తప్పులేదు. దైవప్రవక్త ('స'అస) మరియు సహాబీల (ర'ది.'అన్హుమ్)లలో కూడా ఈ ఆచారం ఉండెను.