Skip to content
القَصَص /

ఆయత్ 56

28 : 56

ఆయత్ 56 of القَصَص (28 : 56). This page carries the verse in the Uthmani script with a translation of its meaning, at a stable URL that can be cited on its own.

القَصَص ఆయతులు 88
సూరా · القَصَص
తెలుగు · Muhammad
28 : 56

إِنَّكَ لَا تَهۡدِي مَنۡ أَحۡبَبۡتَ وَلَٰكِنَّ ٱللَّهَ يَهۡدِي مَن يَشَآءُۚ وَهُوَ أَعۡلَمُ بِٱلۡمُهۡتَدِينَ

(ఓ ప్రవక్తా!) నిశ్చయంగా నీవు, నీకు ఇష్టమైన వారికి మార్గదర్శకత్వం చేయలేవు, కాని అల్లాహ్ తాను కోరిన వారికి మార్గదర్శకత్వం చేస్తాడు. మరియు ఆయనకు మార్గదర్శకత్వం పొందే వారెవరో బాగా తెలుసు.

Explanation & meanings · 1
  1. చూఈ ఆయత్ దైవప్రవక్త ('స'అస) పినతండ్రి అబూ 'తాలిబ్ మరణిచినప్పుడు అవతరింపజేయబడింది. అతని ఆఖరు ఘడియలలో దైవప్రవక్త ('స'అస) అతనితో అన్నారు: "ఇప్పుడైనా: 'లా ఇలాహ ఇల్లల్లాహ్' అను. దానితో నేను పునరుత్థానదినమున నీ క్షమాపణ కొరకు అల్లాహ్ (సు.తా.)ను పేడుకోగలను." అక్కడున్న ఖురైష్ సర్దారులను చూసి అతను అలా అనలేదు. ('స'హీ'హ్ బు'ఖారీ) ఇంకా చూ. 14:4.