Skip to content
القَصَص /

ఆయత్ 82

28 : 82
القَصَص ఆయతులు 88
సూరా · القَصَص
తెలుగు · Muhammad
28 : 82

وَأَصۡبَحَ ٱلَّذِينَ تَمَنَّوۡاْ مَكَانَهُۥ بِٱلۡأَمۡسِ يَقُولُونَ وَيۡكَأَنَّ ٱللَّهَ يَبۡسُطُ ٱلرِّزۡقَ لِمَن يَشَآءُ مِنۡ عِبَادِهِۦ وَيَقۡدِرُۖ لَوۡلَآ أَن مَّنَّ ٱللَّهُ عَلَيۡنَا لَخَسَفَ بِنَاۖ وَيۡكَأَنَّهُۥ لَا يُفۡلِحُ ٱلۡكَٰفِرُونَ

మరియు నిన్నటి వరకు అతడి (ఖారూన్) వలే కావలెనని ఎవరైతే కోరుతూ వచ్చారో, వారు ఇప్పుడు ఇలా పలుకసాగారు: "తెలుసుకోండి! అల్లాహ్ తన దాసులలో, తాను కోరిన వారికి జీవనోపాధిని విస్తరింపజేస్తాడు. మరియు (తాను కోరిన వారికి) తగ్గిస్తాడు. ఒకవేళ అల్లాహ్ అనుగ్రహమే మాపై లేకుంటే ఆయన మమ్మల్ని కూడా భూమిలోకి అణగద్రొక్కి ఉండేవాడు. తెలుసుకోండి! సత్యతిరస్కారులు ఎన్నడూ సాఫల్యం పొందలేరు!"

Explanation & meanings · 2
  1. వయ్ క అన్న : ఈ శబ్దానికి, Woe unto thee, Oh, Ah, Know అనే అర్తాలిచ్చారు. అంటే, నీ పాడు గాను, అయ్యే, తెలుసుకో మొదలైనవి.
  2. అల్లాహ్ (సు.తా.) ధన సంపత్తులు ప్రసాదించినంత మాత్రాన అల్లాహ్ (సు.తా.) వానితో సంతుష్టుడయ్యాడని మరియు అల్లాహ్ (సు.తా.) వాటిని ఇవ్వని వాని మీద కోపంతో ఉన్నాడని కాదు. శాశ్వత సుఖసంతోషాలు కేవలం విశ్వసించి సత్కార్యాలు చేసే వారికే లభిస్తాయి. భూలోక సుఖసంతోషాలు, పరలోక సుఖసంతోషాల ముందు అతి స్వల్వమైనవి.