Skip to content
సూరాల జాబితా /

النَّمل

النَّمل is chapter 27 of the Quran and has 93 verses. This page presents it in full in the Uthmani script, with a verse-by-verse translation of its meaning.

93 ఆయతులు సూరా సంఖ్య 27
ఆయత్‌కు వెళ్ళండి
తెలుగు · Muhammad
بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَٰنِ ٱلرَّحِيمِ

طسٓۚ تِلۡكَ ءَايَٰتُ ٱلۡقُرۡءَانِ وَكِتَابٖ مُّبِينٍ

తా-సీన్. ఇవి దివ్యఖుర్ఆన్ ఆయతులు మరియు ఇది ఒక స్పష్టమైన గ్రంథము.

Explanation & meanings · 2
  1. సూరతుల్ బఖరహ్ లోని మొదటి ఆయతు యొక్క ఫుట్‌నోట్ చూడండి.
  2. ఇటువంటి ఆయత్ కొరకు చూడండి, 12:1.

هُدٗى وَبُشۡرَىٰ لِلۡمُؤۡمِنِينَ

ఇవి విశ్వాసులకు మార్గదర్శకత్వం గానూ మరియు శుభవార్తలు ఇచ్చేవి గానూ ఉన్నాయి.

ٱلَّذِينَ يُقِيمُونَ ٱلصَّلَوٰةَ وَيُؤۡتُونَ ٱلزَّكَوٰةَ وَهُم بِٱلۡأٓخِرَةِ هُمۡ يُوقِنُونَ

ఎవరైతే నమాజ్ స్థాపిస్తారో మరియు విధిదానం (జకాత్) ఇస్తారో మరియు పరలోక జీవితాన్ని నమ్ముతారో!

إِنَّ ٱلَّذِينَ لَا يُؤۡمِنُونَ بِٱلۡأٓخِرَةِ زَيَّنَّا لَهُمۡ أَعۡمَٰلَهُمۡ فَهُمۡ يَعۡمَهُونَ

నిశ్చయంగా, ఎవరైతే పరలోక జీవితాన్ని విశ్వసించరో, వారికి మేము వారి చేష్టను ఆకర్షణీయమైనవిగా చేశాము. అందువల్ల వారు అంధుల వలే దారి తప్పి తిరుగుతూ ఉంటారు.

Explanation & meanings · 1
  1. పరలోక జీవితాన్ని నమ్మని వారు తమ భౌతిక మరియు ఆర్థిక లాభాలకే ప్రాధాన్యత నిస్తారు. కాబట్టి వారికి వారి దుష్ట చేష్టలు ఆకర్షణీయమైనవిగా కనిపిస్తాయి. దానివల్ల వారు మరింత మార్గభ్రష్టత్వంలో పడిపోతారు. జిన్నాతులకు మరియు మానవులకు, సత్యాసత్యాలనూ, మంచిచెడులనూ గుర్తించే విచక్షణా శక్తి ఇవ్వబడింది కాబట్టి వారు తమ కర్మలకు తామే బాధ్యులవుతారు. అల్లాహ్ (సు.తా.) తనను తాను సరిదిద్దుకోవటానికి ప్రయత్నించేవానికే సన్మార్గం చూపుతాడు. మరియు బుద్ధిపూర్వకంగా దుర్మార్గాన్ని అవలంభించేవాడిని, వాడి దుర్మార్గంలో వదలుతాడు. చూడండి, 2:7.

أُوْلَٰٓئِكَ ٱلَّذِينَ لَهُمۡ سُوٓءُ ٱلۡعَذَابِ وَهُمۡ فِي ٱلۡأٓخِرَةِ هُمُ ٱلۡأَخۡسَرُونَ

ఇలాంటి వారికి చెడ్డ శిక్ష ఉంది. మరియు చివరకు వారే అందరి కంటే ఎక్కువగా నష్టపడేవారు.