Skip to content
القَصَص /

ఆయత్ 25

28 : 25
القَصَص ఆయతులు 88
సూరా · القَصَص
తెలుగు · Muhammad
28 : 25

فَجَآءَتۡهُ إِحۡدَىٰهُمَا تَمۡشِي عَلَى ٱسۡتِحۡيَآءٖ قَالَتۡ إِنَّ أَبِي يَدۡعُوكَ لِيَجۡزِيَكَ أَجۡرَ مَا سَقَيۡتَ لَنَاۚ فَلَمَّا جَآءَهُۥ وَقَصَّ عَلَيۡهِ ٱلۡقَصَصَ قَالَ لَا تَخَفۡۖ نَجَوۡتَ مِنَ ٱلۡقَوۡمِ ٱلظَّٰلِمِينَ

తరువాత ఆ ఇద్దరిలో ఒకామె సిగ్గుపడుతూ మెల్లగా అతని వద్దకు వచ్చి ఇలా అన్నది: "వాస్తవానికి నా తండ్రి - నీవు మా కొరకు (మా పశువులకు) నీరు త్రాపించి నందుకు - ప్రతిఫలమివ్వటానికి, నిన్ను పిలుస్తున్నాడు." అతను, అతని వద్దకు పోయి తన వృత్తాంతాన్ని వినిపించాడు. అప్పుడతను అన్నాడు: "నీవు ఏ మాత్రం భయపడకు. నీవు దుర్మార్గ ప్రజల నుండి విముక్తి పొందావు."

Explanation & meanings · 1
  1. ఆ ఇద్దరు స్త్రీల తండ్రి పేరు ఖుర్ఆన్ పేర్కొనలేదు. ఇమామ్ షౌకాని మరియు ఇతర చాలామంది వ్యాఖ్యాతలు అతని పేరు షు'ఐబ్ ('అ.స.) అని అన్నారు. ఎందుకంటే అతను మద్ యన్ జాతి వారివైపునకే ప్రవక్తగా పంపబడి ఉండెను. కాని ఇబ్నె-కసీ'ర్ అభిప్రాయం వేరుంది. అతను అంటారు: 'షు'ఐబ్ ('అ.స.) మరియు మూసా ('అ.స.) కాలాలలో చాలా గడువు ఉంది. కాబట్టి ఇతను షు'ఐబ్ ('అ.స.) తెగకు చెందిన మరొక వ్యక్తి కావచ్చు.' అల్లాహు ఆలమ్.