28 : 7
وَأَوۡحَيۡنَآ إِلَىٰٓ أُمِّ مُوسَىٰٓ أَنۡ أَرۡضِعِيهِۖ فَإِذَا خِفۡتِ عَلَيۡهِ فَأَلۡقِيهِ فِي ٱلۡيَمِّ وَلَا تَخَافِي وَلَا تَحۡزَنِيٓۖ إِنَّا رَآدُّوهُ إِلَيۡكِ وَجَاعِلُوهُ مِنَ ٱلۡمُرۡسَلِينَ
మేము మూసా తల్లి మనస్సులో ఇలా సూచించాము: "నీవు అతనికి (మూసాకు) పాలు ఇస్తూ ఉండు. కాని అతనికి ప్రమాదమున్నదని, నీవు భావిస్తే అతనిని నదిలో విడిచి పెట్టు. మరియు నీవు భయపడకు మరియు దుఃఖించకు; నిశ్చయంగా మేము అతనిని నీ వద్దకు తిరిగి చేర్చుతాము. మరియు అతనిని (మా) సందేశహరులలో ఒకనిగా చేస్తాము!"
Explanation & meanings · 2
- వ'హీ: అంటే ఇక్కడ ఆమె మనస్సులో ఆలోచన పుట్టించడం.
- చూడండి, 20:39.