Skip to content

నాకు సలాహ్ చేస్తున్న సమయంలో బహిష్టు మొదలైంది. నేను ఏం చేయాలి? మరియు బహిష్టు సమయంలో తప్పిన నమాజులు నేను ఖజా చేయవలసి ఉందా?

السؤال

1వ ప్రశ్న:

నాకు సలాహ్ చేస్తున్న సమయంలో బహిష్టు మొదలైంది. నేను ఏం చేయాలి? మరియు బహిష్టు సమయంలో తప్పిన నమాజులు నేను ఖజా చేయవలసి ఉందా?

س32: دخلت عليّ العادة الشهرية أثناء الصلاة، ماذا أفعل؟ وهل أقضي الصلاة عن مدة الحيض؟

الجواب

జవాబు:

సలాహ్ సమయం గడిచిన తర్వాత స్త్రీకి బహిష్టు మొదలైతే, అనగా పొద్దువాలిన అర్ధగంట తర్వాత ఆమెకు బహిష్టు మొదలైతే, శుద్దిపొందిన తర్వాత ఆ సలాహ్ ఖజా చేయవలసి ఉంటుంది. ఎందుకంటే ఆ సలాహ్ సమయం ప్రారంభమైనప్పుడు ఆమె పరిశుద్దావస్థలో ఉంది.

ఎందుకంటే అల్లాహు తఆలా ఇలా ప్రకటించాడు: "నిశ్చయంగా సలాహ్ (నమాజు) విశ్వాసులపై నిర్ణీత సమయంలో విధిగావించబడింది. {నిసా:103}

మరియు స్త్రీ పై బహిష్టు సమయంలో తప్పిపోయిన నమాజుల ఖజా లేదు. ఎందుకంటే దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక హదీథులో ఇలా ప్రవచించారు:

స్త్రీ బహిష్టు సమయంలో సలాహ్ చేయదు మరియు ఉపవాసమూ పాటించదు కదా!

అంతేకాదు ఇస్లామీయ విద్వాంసులు ఏకీభవించిన ప్రకారం స్త్రీ బహిష్టులో తప్పిపోయిన నమాజులను తిరిగి చేయదు.

కానీ ఆమె ఒక రకాతు లేదా అంతకంటే అధిక సమయం మిగిలి ఉన్నప్పుడు పరిశుద్దత పొందినట్లయితే, ఏ సలాహ్ సమయంలో శుద్ది పొందిందో, ఆ సలాహ్ ఖజా చేయవలసి ఉంటుంది. ఎందుకంటే దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచించారు,

"ఎవరైతే సూర్యాస్తమయానికి ముందు అస్ర్ యొక్క కనీసం ఒక రకాతు చేయగలిగారో, వారు పూర్తిగా అస్ర్ సలాహ్ (నమాజును) పొందారు".

ఎవరైతే సూర్యాస్తమయానికి ముందు అస్ర్ సలాహ్ సలాహ్ సమయంలో శుద్ది పొంది, ఒక రకాతు చేసే సమయం పొందినట్లయితే లేదా సూర్యోదయానికి ముందు శుద్దిపొంది ఒక రకాతు చేసే సమయం పొందినట్లయితే, అప్పుడు మొదటి సందర్భంలో అస్ర్ సలాహ్, రెండవ సందర్భంలో ఫజ్ర్ సలాహ్ ఖజా పూర్తి చేయవలసి ఉంటుంది.

ﺟ32: إذا حدث الحيض بعد دخول وقت الصلاة -كأن حاضت بعد الزوال بنصف ساعةٍ مثلًا- فإنها بعد أن تطهر من الحيض تقضي هذه الصلاة التي دخل وقتها وهي طاهرٌ؛ لقوله تعالى:

﴿...إِنَّ ٱلصَّلَوٰةَ كَانَتۡ عَلَى ٱلۡمُؤۡمِنِينَ كِتَٰبٗا مَّوۡقُوتٗا﴾

[النساء:103].

ولا تقضي الصلاة عن وقت الحيض؛ لقوله ﷺ في الحديث الطويل:

«أَلَيْسَتْ إِذَا حَاضَتْ لَمْ تُصَلِّ، وَلَمْ تَصُمْ؟» [1]،

وأجمع أهل العلم أنها لا تقضي الصلاة التي فاتتها أثناء مدة الحيض.

[12] تقدم تخريجه.

أما إذا طهرت، وكان باقيًا من الوقت مقدار ركعةٍ فأكثر، فإنها تصلّي ذلك الوقت الذي طهرت فيه؛ لقوله ﷺ:

«مَنْ أَدْرَكَ رَكْعَةً مِنَ الْعَصْرِ قَبْلَ أَنْ تَغْرُبَ الشَّمْسُ، فَقَدْ أَدْرَكَ الْعَصْرَ» [2]،

فإذا طهرت وقت العصر، أو قبل طلوع الشمس، وكان باقيًا على غروب الشمس أو طلوعها مقدار ركعةٍ، فإنها تصلّي العصر في المسألة الأولى، والفجر في المسألة الثانية.

[13] تقدم تخريجه.