దర్స్ మరియు ఖుత్బా వినడానికి బహిష్టులో ఉన్న స్త్రీ మస్జిదే హరామ్ లోపల ఆగటానికి సంబంధించిన ఆదేశం ఏమిటి?
السؤال
1వ ప్రశ్న:
దర్స్ మరియు ఖుత్బా వినడానికి బహిష్టులో ఉన్న స్త్రీ మస్జిదే హరామ్ లోపల ఆగటానికి సంబంధించిన ఆదేశం ఏమిటి?
س34: ما حكم وجود المرأة في المسجد الحرام وهي حائضٌ؛ لاستماع الأحاديث والخطب؟
الجواب
జవాబు:
బహిష్టు స్త్రీ మస్జిదే హరాం లేక ఇతర మస్జిదులలో ఆగటానికి అనుమతి లేదు. కానీ మస్జిదు గుండా వెళ్ళడం, అవసరమైన వస్తువులు తీసుకోవడానికి మస్జిదులో ప్రవేశించడం, మొదలైన అత్యావసరాలకుఅనుమతి ఉంది.
మహనీయ దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆయిషా రదియల్లాహు అన్హాతో {1} 'అల్ ఖమ్ర’ తెప్పించినప్పుడు ఆమె సమాధానంగా ‘అల్ ఖుమ్ర మస్జిదులో ఉంది, నేను బహిష్టులో ఉన్నాను అని చెప్పగా, దానికి మహనీయ దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సమాధానమిచ్చారు, "ఋతుస్రావం నీ చేతులకు లేదు కదా."
కనుక ఋతుస్రావంలోని స్త్రీ, మస్జిదులో రక్తం పడుతుంది అనే భయం లేనట్లయితే ఆమె మస్జిదులో వెళ్ళవచ్చు.
[1]الخمرة: సలాహ్ చేసే సజ్జాదహ్. దీనిని 'ఖమ్ర' అని పిలుస్తారు. ఎందుకంటే ఇది ముఖాన్ని కప్పివేస్తుంది.
కానీ వారు అక్కడ కూర్చునే ఉద్దేశ్యంతో ప్రవేశిస్తే మాత్రం వారికి అనుమతి లేదు.
దీనికి ఆధారం ఏమిటంటే, దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సలాహ్ గురించి స్త్రీలకు ఇలా ఆదేశించారు: "వారు యువతులను స్త్రీలను మరియు బహిష్టులో ఉన్న స్త్రీలను ఈద్గాకు తీసుకుని వెళ్ళాలి, కానీ బహిష్టు ఉన్న స్త్రీలు ఈద్గా’కు కొంచెం దూరంలో కూర్చోవాలి.
దీని వలన ఋజువు అవుతున్నది ఏమిటంటే, ’ఖుత్బా ప్రసంగం, హితబోధ మరియు పాఠాలు వినడానికి బహిష్టులో ఉన్నస్త్రీ మస్జిదులో ఆగడానికి అనుమతి లేదు.
ﺟ34: لا يجوز للمرأة الحائض أن تمكث في المسجد الحرام ولا غيره من المساجد، ولكن يجوز لها أن تمر بالمسجد، وتأخذ الحاجة منه وما أشبه ذلك؛ كما قال النبيّ ﷺ لعائشة حين أمرها أن تأتي بالخمرة[1]، فقالت: إنها في الـمسجد، وإنّي حائضٌ، فقال:
«إِنَّ حَيْضَتَكِ لَيْسَتْ فِي يَدِكِ» [2]،
فإذا مرت الحائض في المسجد، وهي آمنةٌ من أن ينزل دمٌ على المسجد، فلا حرج عليها.
[14] الخمرة: هي السجادة يسجد عليها المصلي، وسميت خمرة؛ لأنها تخمر الوجه، أي: تغطيه.
[15] مسلم، كتاب الحيض، باب جواز غسل الحائض رأس زوجها وترجيله (11) (298).
أما إن كانت تريد أن تدخل وتجلس فهذا لا يجوز.
والدليل على ذلك: أن النبي ﷺ أمر النّساء في صلاة العيد أن يخرجن إلى مصلى العيد -العواتق، وذوات الخدور، والحيض- إلا أنه أمر أن يعتزل الحيض المصلى [3]،
فدل ذلك على أنّ الحائض لا يجوز لها أن تمكث في المسجد لاستماع الخطبة، أو استماع الدرس والأحاديث.
[16] البخاري، كتاب العيدين، باب خروج النساء والحيض (974)، ومسلم، كتاب العيدين، باب ذكر إباحة خروج النساء في العيدين إلى المصلى (10) (890).
من أحكام الطهارة في الصلاة