Skip to content

బహిష్టులో ఉన్న స్త్రీ లేదా పురుటి ముట్టులో ఉన్న స్త్రీ ఒకవేళ ఫజ్ర్ కంటే ముందు శుద్ది పొంది, ఫజ్ర్ సమయం తరువాత గుసుల్ చేసినట్లయితే, ఆమె ఉపవాసం చెల్లుతుందా? చెల్లదా?

السؤال

1వ ప్రశ్న:

బహిష్టులో ఉన్న స్త్రీ లేదా పురుటి ముట్టులో ఉన్న స్త్రీ ఒకవేళ ఫజ్ర్ కంటే ముందు శుద్ది పొంది, ఫజ్ర్ సమయం తరువాత గుసుల్ చేసినట్లయితే, ఆమె ఉపవాసం చెల్లుతుందా? చెల్లదా?

س7: إذا طهرت الحائض أو النّفساء قبل الفجر، ولم تغتسل إلا بعد الفجر، فهل يصحّ صومها، أو لا؟

الجواب

జవాబు:

అవును చెల్లుతుంది! ఋతుకాలపు స్త్రీ, అలాగే పురుటి ముట్టులో ఉన్న స్త్రీ, ఫజ్ర్ కంటే ముందు శుద్ది పొంది. ఫజ్ర్ సమయం తరువాత గుసుల్ చేసిన పక్షంలో ఆమె ఉపవాసం చెల్లుతుంది. ఎందుకంటే శుద్ది పొందిన సమయం, ఆమె ఉపవాసం ప్రారంభించేందుకు యోగ్యమైన సమయం యొక్క పరిధిలోనే ఉంది. కనుక ఆమె కూడా, ఫజ్ర్ సమయం తరువాత అశుద్దావస్థలో సహరీ చేసిన పురుషుడితో సమానం. అందువల్ల ఆమె ఉపవాసం కూడా చెల్లుతుంది.

అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:{فَالآنَ بَاشِرُوهُنَّ وَابْتَغُواْ مَا كَتَبَ اللّهُ لَكُمْ وَكُلُواْ وَاشْرَبُواْ حَتَّى يَتَبَيَّنَ لَكُمُ الْخَيْطُ الأَبْيَضُ مِنَ الْخَيْطِ الأَسْوَدِ مِنَ الْفَجْرِ}[అల్ బఖర:187] "...ఇక నుండి మీరు మీ భార్యలతో సంభోగం (బాషిర్) చేయండి మరియు అల్లాహ్ మీ కొరకు వ్రాసిన దానిని కోరండి. మరియు ఉదయకాలపు తెల్లరేఖలు రాత్రి నల్లచారల నుండి స్పష్టపడే వరకు, మీరు తినండి, త్రాగండి". (2:187)

అల్లాహు తఆల ఉషోదయ సమయం (ఫజ్రె సాదిఖ్) వరకు సంభోగానికి అనుమతి ఇచ్చాడు దీని నుండి ఉషోదయం గడిచిన తరువాత కూడా గుసుల్ చేసి, ఉపవాసాన్ని కొనసాగించ వచ్చని అర్ధమవుతుంది. ఆయిషా రదియల్లాహు అన్హా ఉల్లేఖనం : దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన భార్యలతో రమించి అశుద్దావస్థలోనే సహరీ చేసేవారు. అదే స్థితిలో ఉపవాసం మొదలు పెట్టి, తరువాత గుసుల్ చేసేవారు. (ఫజ్ర్ సలాహ్ కంటే ముందే గుసుల్ చేసేవారు).

అనగా: దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉషోదయం తరువాత జనాబతు అశుద్దత నుండి గుసుల్ ఆచరించి ఉన్నారు.

ﺟ7: نعم، يصحّ صوم المرأة الحائض إذا طهرت قبل الفجر، ولم تغتسل إلا بعد طلوع الفجر، وكذلك النّفساء؛ لأنها حينئذٍ من أهل الصوم، وهي شبيهةٌ بمن عليه جنابةٌ، إذا طلع الفجر وهو جنبٌ فإن صومه يصحّ؛ لقوله تعالى:

﴿...فَٱلۡـَٰٔنَ بَٰشِرُوهُنَّ وَٱبۡتَغُواْ مَا كَتَبَ ٱللَّهُ لَكُمۡۚ وَكُلُواْ وَٱشۡرَبُواْ حَتَّىٰ يَتَبَيَّنَ لَكُمُ ٱلۡخَيۡطُ ٱلۡأَبۡيَضُ مِنَ ٱلۡخَيۡطِ ٱلۡأَسۡوَدِ مِنَ ٱلۡفَجۡرِ...﴾

[البقرة:187]،

وإذا أذن الله تعالى بالجماع إلى أن يتبين الفجر لزم من ذلك ألّا يكون الاغتسال إلا بعد طلوع الفجر، ولحديث عائشة رضي الله عنها

«أَنَّ النَّبِيَّ ﷺ كَانَ يُصْبِحُ جُنُبًا مِنْ جِمَاعِ أَهْلِهِ وَهُوَ صَائِمٌ» [1].

أي: أنه عليه الصلاة والسلام لا يغتسل عن الجنابة إلا بعد طلوع الصّبح.

[1] البخاري، كتاب الصوم، باب اغتسال الصائم (1931)، ومسلم، كتاب الصوم، باب صحة صوم من طلع عليه الفجر وهو جنب (75) (1109).