Skip to content

వినయం అంటే ఏమిటి?

الباب / الفصل
قسم الأخلاق

السؤال

س١٩: ما هو التواضع؟

ప్రశ్న19: వినయం అంటే ఏమిటి?

الجواب

ج:هو أن لا يرى الإنسان نفسه على الناس، فلا يستحقر الناس ولا يرفض الحق.

  • قال تَعَالَى:

﴿وَعِبَادُ الرَّحْمَنِ الَّذِينَ يَمْشُونَ عَلَى الْأَرْضِ هَوْنًا﴾

[الفرقان: ٦٣]،

أي: متواضعين.

  • وقالَ رسولُ اللهِ ﷺ:

«وما تَواضَعَ أحَدٌ للهِ إلَّا رَفَعَهُ اللهُ»

رواه مسلم.

  • وقال صلى الله عليه وسلم:

«إنَّ اللهَ أَوْحى إليَّ أنْ تَواضَعُوا، حتَّى لا يَفخَرَ أحَدٌ على أحَدٍ، ولا يَبْغيَ أحَدٌ على أحَدٍ»

జవాబు: ఒకరు తనను తాను ఇతరుల కంటే గొప్పవారు అని ఆలోచించక పోవడమే వినయం, వినమ్రత, అణుకువ; దాని వలన, ఒక వ్యక్తి ప్రజలను తృణీకరించడు లేదా సత్యాన్ని తిరస్కరించడు.

మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

{భూమిపై వినయంగా నడిచేవారే అత్యంత కరుణామయుని దాసులు.}

[ఫుర్ఖాన్ : 63]

వారు నిరాడంబరులు, వినయులు అని అర్థం

రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు:

అల్లాహ్ ప్రసన్నత కోసం తనను తాను తగ్గించుకుని వినయం, అణుకువలతో మెలిగేవారి స్థాయిని అల్లాహ్ పెంచకుండా ఎవ్వరూ మిగలరు.

దీనిని ముస్లిం ఉల్లేఖించారు.

మరియు దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు:

{నిశ్చయంగా అల్లాహ్ నా వైపుకు ఈ విషయాల వ'హీ (దివ్యవాణి) పంపాడు: మీరు వినమ్రతను కలిగి ఉండండి. ఒకరిపై మరొకరు దురాక్రమణ'తో హద్దు మీరవద్దు మరియు ఒకరిపట్ల మరొకరు గర్వం, అహంకారం చూప వద్దు}