Skip to content
సూరాల జాబితా /

الوَاقِعة

الوَاقِعة is chapter 56 of the Quran and has 96 verses. This page presents it in full in the Uthmani script, with a verse-by-verse translation of its meaning.

96 ఆయతులు సూరా సంఖ్య 56
ఆయత్‌కు వెళ్ళండి
తెలుగు · Muhammad
بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَٰنِ ٱلرَّحِيمِ

إِذَا وَقَعَتِ ٱلۡوَاقِعَةُ

ఆ అనివార్య సంఘటన సంభవించినపుడు,

Explanation & meanings · 1
  1. అనివార్య సంఘటన అంటే, అంతిమ ఘడియ, పునరుత్థాన దినం.

لَيۡسَ لِوَقۡعَتِهَا كَاذِبَةٌ

అది సంభవించటంలో ఎలాంటి సందేహం (అసత్యం) లేదు.

خَافِضَةٞ رَّافِعَةٌ

అది కొందరిని హీనపరుస్తుంది, మరికొందరిని పైకెత్తుతుంది.

Explanation & meanings · 1
  1. అల్లాహ్ (సు.తా.) ఆజ్ఞలను అనుసరించిన వారు పైకెత్తబడతారు. వాటిని తిరస్కరించిన వారు హీనపరచబడతారు.

إِذَا رُجَّتِ ٱلۡأَرۡضُ رَجّٗا

భూమి తీవ్ర కంపనంతో కంపించినపుడు;

وَبُسَّتِ ٱلۡجِبَالُ بَسّٗا

మరియు పర్వతాలు పొడిగా మార్చబడినపుడు;