Skip to content
సూరాల జాబితా /

الحدِيد

الحدِيد is chapter 57 of the Quran and has 29 verses. This page presents it in full in the Uthmani script, with a verse-by-verse translation of its meaning.

29 ఆయతులు సూరా సంఖ్య 57
ఆయత్‌కు వెళ్ళండి
తెలుగు · Muhammad
بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَٰنِ ٱلرَّحِيمِ

سَبَّحَ لِلَّهِ مَا فِي ٱلسَّمَٰوَٰتِ وَٱلۡأَرۡضِۖ وَهُوَ ٱلۡعَزِيزُ ٱلۡحَكِيمُ

ఆకాశాలలోను మరియు భూమిలోను ఉన్న సమస్తం అల్లాహ్ పవిత్రతను కొనియాడుతుంటాయి. మరియు ఆయనే సర్వశక్తిమంతుడు, మహా వివేకవంతుడు.

Explanation & meanings · 1
  1. చూడండి, 17:44, 21:79.

لَهُۥ مُلۡكُ ٱلسَّمَٰوَٰتِ وَٱلۡأَرۡضِۖ يُحۡيِۦ وَيُمِيتُۖ وَهُوَ عَلَىٰ كُلِّ شَيۡءٖ قَدِيرٌ

ఆకాశాలపై మరియు భూమిపై సామ్రాజ్యాధిపత్యం ఆయనదే. ఆయనే జీవన మిచ్చేవాడు మరియు మరణమిచ్చేవాడు. మరియు ఆయనే ప్రతిదీ చేయగల సమర్ధుడు.

هُوَ ٱلۡأَوَّلُ وَٱلۡأٓخِرُ وَٱلظَّٰهِرُ وَٱلۡبَاطِنُۖ وَهُوَ بِكُلِّ شَيۡءٍ عَلِيمٌ

ఆయనే ప్రథమం మరియు ఆయనే అంతం మరియు ఆయనే ప్రత్యక్షుడు మరియు ఆయనే పరోక్షుడు. మరియు ఆయనే ప్రతిదాని గురించి జ్ఞానం గలవాడు.

Explanation & meanings · 2
  1. దైవప్రవక్త ('స'అస) ప్రవచనం: 'కాలం, అనేది మానవుని జ్ఞానపరిధికి మించినది, కాని దానిని అల్లాహ్ (సు.తా.) సృష్టించాడు.'
  2. ప్రతి వస్తువు చివరకు అల్లాహ్ (సు.తా.) వద్దకు మాత్రమే చేరుతుంది. ఎందుకంటే ఆయన (సు.తా.) ప్రతిదానికి మూలం. ఆయన ప్రతిదానికి - మరే ఇతర దానికంటే - తన జ్ఞానపరంగా సమీపంలో ఉన్నాడు. అల్-అవ్వలు: The First, ప్రథముడు, మొట్ట మొదట వాడు, ఆద్యుడు, సర్వసృష్టిరాసుల సృష్టికి పూర్వమే ఉన్నవాడు. అల్-ఆఖరు: The Last, The End. అంతం, కడపటి, చివరికి మిగిలే వాడు, సర్వసృష్టిరాసుల వినాశం తరువాత కూడా ఉండేవాడు. అజ్-'జాహిరు: The Ascendant or Predominant, over all things, The Outward. ప్రత్యక్షుడు, గోచరుడు, బాహ్యం. అల్-బాతిను: He who knows the secret and hidden things. He who is veiled from the eyes and imaginations of created beings. పరోక్షకుడు, అగోచరుడు, దృష్టికి గోచరించని, గోప్యమైన, మరగైనవాడు. ఇవి అల్లాహ్ (సు.తా.) అత్యుత్తమ పేర్లు.

هُوَ ٱلَّذِي خَلَقَ ٱلسَّمَٰوَٰتِ وَٱلۡأَرۡضَ فِي سِتَّةِ أَيَّامٖ ثُمَّ ٱسۡتَوَىٰ عَلَى ٱلۡعَرۡشِۖ يَعۡلَمُ مَا يَلِجُ فِي ٱلۡأَرۡضِ وَمَا يَخۡرُجُ مِنۡهَا وَمَا يَنزِلُ مِنَ ٱلسَّمَآءِ وَمَا يَعۡرُجُ فِيهَاۖ وَهُوَ مَعَكُمۡ أَيۡنَ مَا كُنتُمۡۚ وَٱللَّهُ بِمَا تَعۡمَلُونَ بَصِيرٞ

ఆయనే ఆకాశాలను మరియు భూమిని ఆరు దినములలో (అయ్యామ్ లలో) సృష్టించిన వాడు, తరువాత ఆయన సింహాసనాన్ని (అర్ష్ ను) అధిష్టించాడు. భూమిలోకి పోయేది మరియు దాని నుండి బయటికి వచ్చేది మరియు ఆకాశం నుండి దిగేది మరియు దానిలోకి ఎక్కేది అంతా ఆయనకు తెలుసు. మరియు మీరెక్కడున్నా ఆయన మీతో పాటు ఉంటాడు మరియు అల్లాహ్ మీరు చేసేదంతా చూస్తున్నాడు.

Explanation & meanings · 2
  1. చూడండి, 7:54, 10:3, 32:4 మొదలైన వాటిలో ఈ వాక్యం ఉంది.
  2. చూడండి, 34:2.

لَّهُۥ مُلۡكُ ٱلسَّمَٰوَٰتِ وَٱلۡأَرۡضِۚ وَإِلَى ٱللَّهِ تُرۡجَعُ ٱلۡأُمُورُ

ఆకాశాలపై మరియు భూమిపై స్రామ్రాజ్యాధిపత్యం ఆయనదే మరియు అన్ని వ్యవహారాలు (నిర్ణయానికై) అల్లాహ్ వైపునకే తీసుకుపోబడతాయి.