Skip to content
సూరాల జాబితా /

الرَّحمٰن

الرَّحمٰن is chapter 55 of the Quran and has 78 verses. This page presents it in full in the Uthmani script, with a verse-by-verse translation of its meaning.

78 ఆయతులు సూరా సంఖ్య 55
ఆయత్‌కు వెళ్ళండి
తెలుగు · Muhammad
بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَٰنِ ٱلرَّحِيمِ

ٱلرَّحۡمَٰنُ

అనంత కరుణామయుడు (అల్లాహ్)!

عَلَّمَ ٱلۡقُرۡءَانَ

ఆయనే ఈ ఖుర్ఆన్ ను నేర్పాడు.

Explanation & meanings · 1
  1. ఇది మక్కా ముష్రికులకు ఇవ్వబడిన జవాబు. ఎందుకంటే వారు, దైవప్రవక్త (సఅస) మీద, ఈ ఖుర్ఆన్ ను అతనికి ఒక మానవుడు నేర్పాడు అనే అపనింద మోపారు. కాని వాస్తవానికి అల్లాహ్ (సు.తా.) దీనిని తన సందేశహరునికి నేర్పాడు మరియు అతను తమ అనుచరులకు (ర'ది.'అన్హుమ్) నేర్పారు. (ఫ'త్హ్ అల్-ఖదీర్).

خَلَقَ ٱلۡإِنسَٰنَ

ఆయనే మానవుణ్ణి సృష్టించాడు.

عَلَّمَهُ ٱلۡبَيَانَ

ఆయనే అతనికి మాట్లాడటం నేర్పాడు.

ٱلشَّمۡسُ وَٱلۡقَمَرُ بِحُسۡبَانٖ

సూర్యుడు మరియు చంద్రుడు ఒక నియమిత గమనాన్ని (నియమిత పరిధిలో) అనుసరిస్తున్నారు.