Skip to content
آل عِمران /

ఆయత్ 199

3 : 199

ఆయత్ 199 of آل عِمران (3 : 199). This page carries the verse in the Uthmani script with a translation of its meaning, at a stable URL that can be cited on its own.

آل عِمران ఆయతులు 200
సూరా · آل عِمران
తెలుగు · Muhammad
3 : 199

وَإِنَّ مِنۡ أَهۡلِ ٱلۡكِتَٰبِ لَمَن يُؤۡمِنُ بِٱللَّهِ وَمَآ أُنزِلَ إِلَيۡكُمۡ وَمَآ أُنزِلَ إِلَيۡهِمۡ خَٰشِعِينَ لِلَّهِ لَا يَشۡتَرُونَ بِـَٔايَٰتِ ٱللَّهِ ثَمَنٗا قَلِيلًاۚ أُوْلَٰٓئِكَ لَهُمۡ أَجۡرُهُمۡ عِندَ رَبِّهِمۡۗ إِنَّ ٱللَّهَ سَرِيعُ ٱلۡحِسَابِ

మరియు నిశ్చయంగా, గ్రంథ ప్రజలలో, కొందరు అల్లాహ్ ను విశ్వసిస్తారు. మరియు వారు మీకు అవతరింపజేయబడిన దానిని మరియు వారికి అవతరింపజేయబడిన దానిని (సందేశాన్ని) విశ్వసించి, అల్లాహ్ కు వినమ్రులై, అల్లాహ్ సూక్తులను స్వల్పమైన మూల్యానికి అమ్ముకోరు. అలాంటి వారికి వారి ప్రభువు వద్ద ప్రతిఫలం ఉంది. నిశ్చయంగా, అల్లాహ్ లెక్క తీసుకోవటంలో అతి శీఘ్రుడు.

Explanation & meanings · 1
  1. ఈ ఆయత్ లో దైవప్రవక్త ము'హమ్మద్ ('స'అస) ను విశ్వసించిన పూర్వగ్రంథ ప్రజలను గురించి చెప్పబడింది. ఉదా: 'అబ్దుల్లాహ్ బిన్ సల్లామ్, మరియు సల్మాన్ పార్సీ మొదలైనవారు. (ర'ది.'అన్హుమ్). వారిలో దాదాపు 10 మంది మాత్రమే యూదులు, కాని క్రైస్తవులు అధిక సంఖ్యలో ఉండిరి. (ఇబ్నె - కసీ'ర్).