Skip to content
آل عِمران /

ఆయత్ 36

3 : 36
آل عِمران ఆయతులు 200
సూరా · آل عِمران
తెలుగు · Muhammad
3 : 36

فَلَمَّا وَضَعَتۡهَا قَالَتۡ رَبِّ إِنِّي وَضَعۡتُهَآ أُنثَىٰ وَٱللَّهُ أَعۡلَمُ بِمَا وَضَعَتۡ وَلَيۡسَ ٱلذَّكَرُ كَٱلۡأُنثَىٰۖ وَإِنِّي سَمَّيۡتُهَا مَرۡيَمَ وَإِنِّيٓ أُعِيذُهَا بِكَ وَذُرِّيَّتَهَا مِنَ ٱلشَّيۡطَٰنِ ٱلرَّجِيمِ

తరువాత ఆమె ఆడ శిశువు (మర్యమ్) ను ప్రసవించినప్పుడు, ఆమె ఇలా విన్నవించుకున్నది: "ఓ నా ప్రభూ! నేను ఆడ శిశువును ప్రసవించాను" - ఆమె ప్రసవించినదేమిటో అల్లాహ్ కు బాగా తెలుసు మరియు బాలుడు బాలిక వంటి వాడు కాడు - "మరియు నేను ఈమెకు మర్యమ్ అని పేరు పెట్టాను. మరియు నేను ఈమెను మరియు ఈమె సంతానాన్ని శపించబడిన (బహిష్కరించబడిన) షైతాన్ నుండి రక్షించటానికి, నీ శరణు వేడుకుంటున్నాను!"

Explanation & meanings · 2
  1. 'హాఫి"జ్ ఇబ్నె ఖయ్యిమ్, ఎన్నో హదీసులను పరిశీలించి క్రొత్తగా పుట్టిన బిడ్డ పేరు మొదటిరోజు, లేక మూడవ రోజు లేక ఏడవ రోజు పెట్టటం మంచిదని అన్నారు.
  2. క్రొత్తగా పుట్టిన ప్రతి బిడ్డను షై'తాన్ తాకుతాడు దానితో ఆ బిడ్డ ఏడుస్తోంది. కాని అల్లాహ్ (సు.తా.) ఈ షై'తాన్ తాకటం నుండి మర్యమ్ మరియు 'ఈసా ('అ.స.) లను ఇద్దరినీ రక్షించాడు. ('స. బు'ఖారీ, కితాబ్ అత్ తఫ్సీర్; ముస్లిం, కితాబ్ అల్ ఫ'దాయిల్).