3 : 92
لَن تَنَالُواْ ٱلۡبِرَّ حَتَّىٰ تُنفِقُواْ مِمَّا تُحِبُّونَۚ وَمَا تُنفِقُواْ مِن شَيۡءٖ فَإِنَّ ٱللَّهَ بِهِۦ عَلِيمٞ
మీకు అత్యంత ప్రీతికరమైన దానిని మీరు (అల్లాహ్ మార్గంలో) ఖర్చు పెట్టనంత వరకు మీరు పుణ్యాత్ములు (ధర్మనిష్ఠాపరులు) కాలేరు. మరియు మీరు ఏమి ఖర్చుపెట్టినా అది అల్లాహ్ కు తప్పక తెలుస్తుంది.
Explanation & meanings · 1
- ఏ వస్తువు దానం చేసినా పుణ్యం దొరుకుతుంది. కాని తనకు నచ్చిన వస్తువులలో నుండి దానం చేస్తే దానికి ఎంతో గొప్ప పుణ్యం లభిస్తుంది. దానానికి పేదవారైన దగ్గరి బంధువులు ఎవరినైతే పోషించడం విధి కాదో వారు ఎక్కువ హక్కుదారులు. ఇంకా చూడండి, 2:177.