Skip to content
آل عِمران /

ఆయత్ 159

3 : 159

ఆయత్ 159 of آل عِمران (3 : 159). This page carries the verse in the Uthmani script with a translation of its meaning, at a stable URL that can be cited on its own.

آل عِمران ఆయతులు 200
సూరా · آل عِمران
తెలుగు · Muhammad
3 : 159

فَبِمَا رَحۡمَةٖ مِّنَ ٱللَّهِ لِنتَ لَهُمۡۖ وَلَوۡ كُنتَ فَظًّا غَلِيظَ ٱلۡقَلۡبِ لَٱنفَضُّواْ مِنۡ حَوۡلِكَۖ فَٱعۡفُ عَنۡهُمۡ وَٱسۡتَغۡفِرۡ لَهُمۡ وَشَاوِرۡهُمۡ فِي ٱلۡأَمۡرِۖ فَإِذَا عَزَمۡتَ فَتَوَكَّلۡ عَلَى ٱللَّهِۚ إِنَّ ٱللَّهَ يُحِبُّ ٱلۡمُتَوَكِّلِينَ

(ఓ ప్రవక్తా!) అల్లాహ్ యొక్క అపార కారుణ్యం వల్లనే నీవు వారి పట్ల మృదుహృదయుడవయ్యావు. నీవే గనక క్రూరుడవు, కఠిన హృదయుడవు అయి వుంటే, వారందరూ నీ చుట్టుప్రక్కల నుండి దూరంగా పారిపోయే వారు. కావున నీవు వారిని మన్నించు, వారి క్షమాపణ కొరకు (అల్లాహ్ ను) ప్రార్థించు మరియు వ్యవహారాలలో వారిని సంప్రదించు. ఆ పిదప నీవు కార్యానికి సిద్ధమైనపుడు అల్లాహ్ పై ఆధారపడు. నిశ్చయంగా, అల్లాహ్ తనపై ఆధారపడే వారిని ప్రేమిస్తాడు.

Explanation & meanings · 1
  1. మీరు మీ వ్యవహారాలలో మీ తోటివారితో, మీ బంధువులతో, స్నేహితులతో సంప్రదింపులు చేయండి. కాని చివరకు నిర్ణయం తీసుకునేటప్పుడు అల్లాహ్ (సు.తా.) పై ఆదారపడండి. మీకు మంచిది అనిపించిన నిర్ణయం తీసుకోండి.