Skip to content
آل عِمران /

ఆయత్ 7

3 : 7

ఆయత్ 7 of آل عِمران (3 : 7). This page carries the verse in the Uthmani script with a translation of its meaning, at a stable URL that can be cited on its own.

آل عِمران ఆయతులు 200
సూరా · آل عِمران
తెలుగు · Muhammad
3 : 7

هُوَ ٱلَّذِيٓ أَنزَلَ عَلَيۡكَ ٱلۡكِتَٰبَ مِنۡهُ ءَايَٰتٞ مُّحۡكَمَٰتٌ هُنَّ أُمُّ ٱلۡكِتَٰبِ وَأُخَرُ مُتَشَٰبِهَٰتٞۖ فَأَمَّا ٱلَّذِينَ فِي قُلُوبِهِمۡ زَيۡغٞ فَيَتَّبِعُونَ مَا تَشَٰبَهَ مِنۡهُ ٱبۡتِغَآءَ ٱلۡفِتۡنَةِ وَٱبۡتِغَآءَ تَأۡوِيلِهِۦۖ وَمَا يَعۡلَمُ تَأۡوِيلَهُۥٓ إِلَّا ٱللَّهُۗ وَٱلرَّٰسِخُونَ فِي ٱلۡعِلۡمِ يَقُولُونَ ءَامَنَّا بِهِۦ كُلّٞ مِّنۡ عِندِ رَبِّنَاۗ وَمَا يَذَّكَّرُ إِلَّآ أُوْلُواْ ٱلۡأَلۡبَٰبِ

ఆయన (అల్లాహ్) యే నీపై (ఓ ముహమ్మద్!) ఈ గ్రంథాన్ని (ఖుర్ఆన్ ను) అవతరింపజేశాడు, ఇందులో కొన్ని స్పష్టమైన అర్థమిచ్చే ఆయతులు (ముహ్ కమాత్) ఉన్నాయి. అవి ఈ గ్రంథానికి మూలాలు. మరికొన్ని అస్పష్టమైనవి (ముతషాబిహాత్) ఉన్నాయి. కావున తమ హృదయాలలో వక్రత ఉన్నవారు, సంక్షోభాన్ని రేకెత్తించటానికి మరియు గూఢార్థాలను అపేక్షించి ఎల్లప్పుడూ అస్పష్టమైన వాటి వెంటబడతారు. వాటి అసలు అర్థం అల్లాహ్ కు తప్ప మరెవ్వరికీ తెలియదు. కానీ, పరిపక్వ జ్ఞానం గలవారు: "మేము దీనిని విశ్వసించాము, ప్రతి ఒక్కటీ మా ప్రభువు వద్ద నుండి వచ్చినదే!" అని అంటారు. జ్ఞానవంతులు తప్ప ఇతరులు వీటిని గ్రహించలేరు.

Explanation & meanings · 1
  1. ము'హ్ కమాతున్: అంటే, అల్లాహుతా'ఆలా ఆజ్ఞలను, ఆయన నిషేధించిన వాటిని, 'హలాల్ చేసిన వాటిని, కథలను మొదలైన స్పష్టంగా తెలియజేసే ఆయతులు. ఈ ఆయతుల భావం స్పష్టంగా ఉంటుంది. ఇవి దివ్యగ్రంథ పునాదులు. వీటిని ఉమ్ముల్-కితాబ్ అని అంటారు. ఏ ఆయతుల అర్థంలో సంశయానికి తావు ఉంటుందో వాటిని ముతషాబిహాతున్ అంటారు. ఏ విషయాలైతే మానవ ఇంద్రియాలకు అతీతంగా ఉన్నాయో వాటిని వివరించటానికి, వాటికి దగ్గరగా పోలికవున్న, గోచర విషయాలకు మానవభాషలో లభించే పదాలు ఉపయోగించబడిన ఆయతులు. ఉదా: స్వర్గం, నరకం మొదలైనవి. కావున మానవుడు ముతషాబిహాత్ లను చదివేటప్పుడు వాటిని ము'హ్ కమాత్ ల వెలుగులో అర్తం చేసుకోవటానికి ప్రయత్నించాలి. ఎందుకంటే ఖుర్ఆన్ వాటిని ఉమ్ముల్ కితాబ్ - గ్రంథమూలాలు, అన్నది.