Skip to content
آل عِمران /

ఆయత్ 130

3 : 130

ఆయత్ 130 of آل عِمران (3 : 130). This page carries the verse in the Uthmani script with a translation of its meaning, at a stable URL that can be cited on its own.

آل عِمران ఆయతులు 200
సూరా · آل عِمران
తెలుగు · Muhammad
3 : 130

يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُواْ لَا تَأۡكُلُواْ ٱلرِّبَوٰٓاْ أَضۡعَٰفٗا مُّضَٰعَفَةٗۖ وَٱتَّقُواْ ٱللَّهَ لَعَلَّكُمۡ تُفۡلِحُونَ

ఓ విశ్వాసులారా! ఇబ్బడిముబ్బడిగా పెరిగే ఈ వడ్డీని తినకండి. మరియు మీరు సాఫల్యం పొందటానికి అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండండి.

Explanation & meanings · 1
  1. చూడండి, 2:278, అబూహురైరా (ర'ది.'అ.) కథనం, దైవప్రవక్త ('స'అస) ఇలా సెలవిచ్చారు: "ఏడు మహా పాపాల నుండి దూరంగా ఉండండి." స'హాబా (ర'ది.'అన్హుమ్) అడిగారు : "ఓ ప్రవక్తా ('స'అస)! అవి ఏమిటి?" దైవప్రక్త ('స'అస) ఇలా సమాధానమిచ్చారు : "అవి 1) ఆరాధనలలో అల్లాహ్ (సు.తా.) కు భాగస్వాములను కల్పించటం, 2) మంత్ర తంత్రాలు చేయటం, 3) అల్లాహుతా'ఆలా నిషేధించిన ప్రాణిని అన్యాయంగా చంపటం, 4) వడ్డీ తినటం, 5) అనాథుల ఆస్తిని కబళించటం, 6) యుద్ధరంగంలో పిరికితనంతో శత్రువుకు వెన్ను చూపి పారిపోవటం, 7) పతివ్రత స్త్రీలపై నిందలు మోపటం." ('స'హీ'హ్ బు'ఖారీ, పుస్తకం - 4, 'హదీస్' నం. 28).