Skip to content
آل عِمران /

ఆయత్ 118

3 : 118

ఆయత్ 118 of آل عِمران (3 : 118). This page carries the verse in the Uthmani script with a translation of its meaning, at a stable URL that can be cited on its own.

آل عِمران ఆయతులు 200
సూరా · آل عِمران
తెలుగు · Muhammad
3 : 118

يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُواْ لَا تَتَّخِذُواْ بِطَانَةٗ مِّن دُونِكُمۡ لَا يَأۡلُونَكُمۡ خَبَالٗا وَدُّواْ مَا عَنِتُّمۡ قَدۡ بَدَتِ ٱلۡبَغۡضَآءُ مِنۡ أَفۡوَٰهِهِمۡ وَمَا تُخۡفِي صُدُورُهُمۡ أَكۡبَرُۚ قَدۡ بَيَّنَّا لَكُمُ ٱلۡأٓيَٰتِۖ إِن كُنتُمۡ تَعۡقِلُونَ

ఓ విశ్వాసులారా! మీరు మీ వారిని (విశ్వాసులను) తప్ప ఇతరులను మీ సన్నిహిత స్నేహితులుగా చేసుకోకండి. వారు మీకు హాని కలిగించే ఏ అవకాశాన్నైనా ఉపయోగించు కోవటానికి వెనుకాడరు. వారు మిమ్మల్ని ఇబ్బందిలో చూడగోరుతున్నారు. మరియు వారి ఈర్ష్య వారి నోళ్ళ నుండి బయటపడుతున్నది. కాని వారి హృదయాలలో దాచుకున్నది దాని కంటే తీవ్రమైనది. వాస్తవానికి మేము ఈ సూచనలను మీకు స్పష్టం చేశాము. మీరు అర్థం చేసుకోగలిగితే (ఎంత బాగుండేది)!

Explanation & meanings · 1
  1. చూడండి, 60:8-9 ఎవరైతే మీ ధర్మం కారణంగా మిమ్మల్ని విరోధించక మీకు హాని చేయక, మిమ్మల్ని మీ ఇండ్ల నుండి వెళ్ళగొట్టరో, అట్టివారితో మీరు కరుణతో న్యాయంతో వ్యవహరించండి. కాని ఎవరైతే మీ ధర్మం కారణంగా మీతో పోరాడి మిమ్మల్ని మీ ఇండ్ల నుండి వెళ్ళగొడతారో, అలాంటి వారు మీ స్నేహితులు కారు, వారితో ధర్మయుద్ధం (జిహాద్) చేయండి.