“అల్లాహ్ భూమిని ఒడిసి పట్టుకుంటాడు; ఆకాశాలను చుట్టచుట్టి (దానిని కూడా) తన కుడి చేతిలో పెట్టుకుంటాడు. అప్పుడు ఆయన ఇలా అంటాడు “నేనే రారాజును, భూమిపై (రాజరికం చేసిన) రాజులు ఏరీ, ఎక్కడున్నారు?”
అబీ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచిస్తుండగా నేను విన్నాను:
“అల్లాహ్ భూమిని ఒడిసి పట్టుకుంటాడు; ఆకాశాలను చుట్టచుట్టి (దానిని కూడా) తన కుడి చేతిలో పెట్టుకుంటాడు. అప్పుడు ఆయన ఇలా అంటాడు “నేనే రారాజును, భూమిపై (రాజరికం చేసిన) రాజులు ఏరీ, ఎక్కడున్నారు?”
«يَقْبِضُ اللَّهُ الأَرْضَ، وَيَطْوِي السَّمَوَاتِ بِيَمِينِهِ، ثُمَّ يَقُولُ: أَنَا المَلِكُ، أَيْنَ مُلُوكُ الأَرْضِ».
ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేస్తున్నారు: ప్రళయదినము నాడు సర్వోన్నతుడైన అల్లాహ్ భూమినంతటినీ ఒడిసి పట్టుకుని ఒక చోటికి చేర్చి, ఆకాశాన్నంతటినీ చుట్టచుట్టి, వాటిని ఒకదానిపై ఒకటిగా పేర్చి తన కుడి చేతిలో పట్టుకుని వెళ్ళి వాటిని ధ్వంసం చేస్తాడు – అప్పుడు ఇలా అంటాడు: నేనే రారాజును ఏరీ ఆ భూమిపై రాజులు, ఎక్కడున్నారు?
...:
ఇందులో – సర్వోన్నతుడైన అల్లాహ్ యొక్క సామ్రాజ్యము స్థరంగా నిలిచి ఉండేదని (శాశ్వతమైనదనీ), మరియు మిగతా వారి రాజ్యాలు బుద్బుదప్రాయమైనవని, క్షణికమైనవనీ ప్రస్తావించబడినది.
ఈ హదీథు – అల్లాహ్ యొక్క మహాత్మ్యం, ఆయన శక్తి యొక్క గొప్పతనం, ఆయన అధికారం, మరియు ఆయన రాజ్యం యొక్క పరిపూర్ణత గురించి మనకు బోధిస్తుంది
సహీహ్ అల్ బుఖారీ. (6/ 126) (4812).
సహీహ్ ముస్లిం. (4/ 2148) (2787).
ఇంకా (3)
فتح الباري (13/367).
عمدة القاري شرح صحيح البخاري (23/ 101).
البحر المحيط الثجاج (43/324).