Skip to content
837 హదీసులు

ప్రవక్త హదీసుల విజ్ఞాన సర్వస్వం

ఫలితాలను ఫిల్టర్ చేయండి

837 లో 21 కార్డులు

ఫిల్టర్లను తీసివేయి
“నేను నీటి కొలనుపై ఉంటాను, ఆ విధంగా మీలో ఎవరు నా వద్దకు వస్తారో చూస్తాను. కానీ కొంతమంది ప్రజలు నావద్దకు రాకుండా దూరంగా నిలిపి వేయబడతారు. నేను “ఓ ప్రభూ! వారు నా వాళ్ళు, నా సమాజం (ఉమ్మత్) వాళ్ళు” అని వేడుకుంటాను. దానికి “నీకు తెలుసా, నీ తరువాత వీరు ఏమేం చేసినారో?” అని సమాధానం ఇవ్వబడుతుంది. అల్లాహ్ సాక్షిగా వాళ్ళు వేగంగా తమ మడమలపై వెనుదిరిగి పోతారు”.
ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
“బిలాల్! ఇస్లాంలో నువ్వు చేసిన అత్యంత ఆశావహ ఆచరణ ఏమిటో నాకు చెప్పు, ఎందుకంటే నేను స్వర్గంలో నా ముందర నీ చెప్పుల సవ్వడి విన్నాను.” అతను చెప్పారు: “నా దృష్టిలో అత్యంత ఆశావహమైన ఆచరణ ఏమిటంటే, నేను రేయింబవళ్ళలో, ఏ గడియలోనైనా ఉదూ చేసుకున్నప్పుడు, ఆ ఉదూతో నాకు విధివ్రాతలో వ్రాయబడినంత నమాజ్ తప్పకుండా ఆచరిస్తాను.”
ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
"స్వర్గంలో వంద స్థాయిలు ఉంటాయి, ప్రతి రెండు స్థాయిల మధ్య ఆకాశం మరియు భూమి మధ్య దూరం అంత ఉంది. ఫిర్'దౌసు స్వర్గం అత్యున్నత స్థాయి స్వర్గం, మరియు దాని నుండి స్వర్గం యొక్క నాలుగు నదులు ఉద్భవిస్తాయి మరియు దాని పైనే అర్ష్ సింహాసనం ఉంది. కాబట్టి మీరు అల్లాహ్‌ను ఏదైనా అడిగినప్పుడు, ఆయనతో ఫిర్'దౌస్ స్వర్గాన్ని ప్రసాదించమని వేడుకోండి."
ప్రామాణికమైన హదీథు అత్తిర్మిదీ నమోదు చేసినారు:
“పునరుత్థాన దినమున తీర్పు చేయబడే మొదటి విషయం – అక్రమంగా చిందించబడిన రక్తము” (అన్యాయంగా, అధర్మంగా ఎవరినైనా చంపడం, హత్య చేయడం.)
ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
“ఒక మంచి పనికి (సత్కార్యమునకు) సంబంధించి విశ్వాసికి అల్లాహ్ ఎప్పుడూ అన్యాయం చేయడు. ఆ మంచి పని కొరకు ఆయన అతడికి (విశ్వాసికి) ఈ ప్రపంచములో ప్రసాదిస్తాడు, మరియు పరలోకములోనూ దాని ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాడు. మరియు అవిశ్వాసి విషయంలో, అతడు అల్లాహ్ కొరకు మాత్రమే చేసిన మంచి పనులకు, అల్లాహ్ అతనికి ఈ ప్రాపంచిక జీవితములోనే ప్రసాదిస్తాడు. అతడు పరలోకము చేరుకున్నపుడు అతనికి ప్రతిఫలం ప్రసాదించడానికి ఒక్క సత్కార్యమూ ఉండదు".
ప్రామాణికమైన హదీథు ముస్లిం నమోదు చేసినారు:
“ఎవరైతే, (పేదరికం కారణంగా) తీసుకున్న అప్పు తీర్చలేక పోతున్న వానికి వ్యవధినిస్తాడో లేదా ఎవరైతే అతని అప్పులో కొంత భాగాన్ని తగ్గిస్తాడో, అతడికి అల్లాహ్ తన నీడ తప్ప మరింకే నీడ ఉండని ఆ తీర్పు దినమున తన అర్ష్ (సింహాసనము) క్రింద నీడ కల్పిస్తాడు”.
ప్రామాణికమైన హదీథు అత్తిర్మిదీ మరియు అహ్మద్ నమోదు చేసినారు:
“తీర్పు దినము నాడు ప్రజల మధ్య ‘ముఅజ్జిన్’లు (మస్జిదులలో అజాన్ పలికేవారు) పొడవైన మెడలు కలిగి ఉంటారు.”
ప్రామాణికమైన హదీథు ముస్లిం నమోదు చేసినారు:
"స్వర్గంలో ప్రవేశించే మొదటి సమూహం పూర్ణ చంద్రుని (పౌర్ణమి చంద్రుడు) వలె ప్రకాశవంతంగా ఉంటారు. వారిని అనుసరించే తదుపరి సమూహం ఆకాశంలో అత్యంత ప్రకాశవంతమైన నక్షత్రంలా మెరుస్తారు. అక్కడ వారికి మూత్ర విసర్జన, విరేచన, ఉమ్మడం, ముక్కు తుడిచుకోవడం వంటి అవసరాలు ఏవీ ఉండవు. వారి జుట్టు దువ్వుకునే దువ్వెనలు బంగారంతో తయారవుతాయి. వారి చెమట ముస్క్ పరిమళంలా సువాసనను గుబాళిస్తూ ఉంటుంది. వారు ఉపయోగించే ధూపపు కట్టెలు అతి విలువైన అలూవా (ఒక రకం పరిమళ వృక్షం)కు చెందినవి. వారికి హూర్-అల్-ఐన్ (స్వర్గపు అపురూప స్త్రీలు) భార్యలు అవుతారు. వారందరూ ఒకే ఆకారంలో, ఒకే రూపంలో తమ తండ్రి ఆదాం అలైహిస్సలాం రూపాన్ని పోలి, దాదాపు అరవై ముళ్ల (60 ముళ్ల) ఎత్తులో ఉంటారు."
ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు