Skip to content
837 హదీసులు

ప్రవక్త హదీసుల విజ్ఞాన సర్వస్వం

ఫలితాలను ఫిల్టర్ చేయండి

837 లో 72 కార్డులు

ఫిల్టర్లను తీసివేయి
“నిశ్చయంగా అల్లాహ్ అభిమానవంతుడు, విశ్వాసి కూడా అభిమానవంతుడే. అల్లాహ్ యొక్క అభిమానము అంటే దాసుడు అల్లాహ్ నిషేధించిన వాటికి పాల్బడుట (అనగా అల్లాహ్ యొక్క అభిమానము భంగపడినట్లు).”
ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
“ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సహచరులలో కొందరు ఆయన వద్దకు వచ్చి ఇలా అన్నారు: “(ఓ ప్రవక్తా !) అప్పుడప్పుడు మా హృదయలలో ఎటువంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి అంటే, వాటి గురించి మేము (బహిరంగంగా) మాట్లాడడానికి కూడా ధైర్యం చేయలేము”. దానికి ఆయన “నిజంగా మీకు అలా అనిపిస్తూ ఉంటుందా?” అని అడిగారు. దానికి వారు “అవును” అని సమాధానమిచ్చారు. అపుడు ఆయన “అది నిర్మలమైన విశ్వాసము (నిర్మలమైన విశ్వాసానికి నిదర్శనం)” అన్నారు.
ప్రామాణికమైన హదీథు ముస్లిం నమోదు చేసినారు:
“మీలో ఎవరి దగ్గరికైనా షైతాను వచ్చి “ఫలానా, ఫలానా దానినెవరు సృష్టించినాడు, ఫలానా, ఫలానా దానినెవరు సృష్టించినాడు” అని ప్రశ్నిస్తాడు. చివరికి “మరి నీ ప్రభువును (అల్లాహ్’ను) ఎవరు సృష్టించినాడు” అంటాడు. మీలో ఎవరైనా ఈ పరిస్థితిని ఎదుర్కొంటే, అల్లాహ్ యొక్క రక్షణ అర్థించాలి మరియు దాని నుండి దూరం కావాలి”.
ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
“మరియం కుమారుడైన ఈసా అలైహిస్సలాం ను క్రైస్తవులు (హద్దుమీరి) కీర్తించిన విధంగా, నా ప్రశంసలో అతిశయం చేయకండి. నిశ్చయంగా నేను ఆయన (అల్లాహ్) దాసుడను. కనుక నన్ను ‘అల్లాహ్ యొక్క దాసుడు మరియు ఆయన సందేశహరుడు’ అని మాత్రమే అనండి.
ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ నమోదు చేసినారు:
“అనస్ బిన్ మాలిక్ రజియల్లాహు అన్హు మాతో ఇలా అన్నారు: “ఒక వ్యక్తి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ను ఇలా ప్రశ్నించాడు “ఓ ప్రవక్తా సల్లల్లాహు అలైహి వసల్లం ! తీర్పు దినమున అవిశ్వాసి తన ముఖము పై (నడిచేలా) ఎలా సమీకరించబడతాడు?” దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “ అతడిని ఈ భూమి మీద కాళ్ళపై నడిచేలా చేయగలిగిన శక్తిమంతుడు (అయిన అల్లాహ్), తీర్పు దినమున అతడిని ముఖముపై నడిచేలా చేయలేడా?” అన్నారు. ఖతాదహ్ ఇలా అన్నారు “అవును, మా ప్రభువు (అయిన అల్లాహ్) గౌరవం సాక్షిగా (ఆయన అలా చేయగల శక్తిశాలి)”.
ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
“రసూలల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలుకగా నేను విన్నాను: “పరమ పవిత్రుడు, సర్వోన్నతుడూ అయిన అల్లాహ్ ప్రకటన: “ఓ ఆదం కుమారుడా! నీవు నన్ను వేడుకుని, నన్ను అర్ధించినంత కాలం, నా నుండి నీవు ఆశించినంత కాలం, నీలో ఏదైతే ఉన్నదో దానిని నేను క్షమిస్తాను మరియు దానిని నేను పట్టించుకోను. ఓ ఆదం కుమారుడా! నీ పాపాలు ఆకాశపు మేఘాలను చేరేటంత ఎక్కువగా ఉన్నా, అపుడు నీవు నన్ను క్షమించమని వేడుకుంటే, నేను నిన్ను క్షమిస్తాను మరియు దానిని నేను పట్టించుకోను. ఓ ఆదం కుమారుడా! నీవు భూమి అంత పెద్ద పెద్ద పాపాలతో నావద్దకు వచ్చినా, నాకు సమానంగా ఎవరినీ భాగస్వామిగా చేయకుండా నన్ను కలుసుకుంటే నేను అంతకంటే గొప్ప క్షమాపణతో నీ వద్దకు వస్తాను.”
హసన్ హదీథు. అత్తిర్మిదీ నమోదు చేసినారు:
“ఒక వ్యక్తి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చి ఇలా ప్రశ్నించినాడు “ఓ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం! ఆ రెండు అనివార్యమైన విషయాలు ఏమిటి?” ఆయన ఇలా పలికినారు “అల్లాహ్ కు ఎవరినీ లేక దేనినీ సాటి కల్పించని స్థితిలో ఎవరైతే మరణిస్తారో వారు స్వర్గములోనికి ప్రవేశిస్తారు. మరియు ఎవరైతే ఆయనకు సాటి కల్పిస్తున్న స్థితిలో మరణిస్తారో వారు నరకం లోనికి ప్రవేశిస్తారు".
ప్రామాణికమైన హదీథు ముస్లిం నమోదు చేసినారు:
“(ధర్మం విషయంలో) ‘హద్దుమీరేవారు నాశనమయ్యారు”. అలా మూడు సార్లు అన్నారు.
ప్రామాణికమైన హదీథు ముస్లిం నమోదు చేసినారు: