Skip to content
837 హదీసులు

ప్రవక్త హదీసుల విజ్ఞాన సర్వస్వం

ఫలితాలను ఫిల్టర్ చేయండి

837 లో 52 కార్డులు

ఫిల్టర్లను తీసివేయి
“అల్లాహ్ స్వర్గమును మరియు నరకమును సృష్టించినపుడు, జిబ్రయీల్ అలైహిస్సలాం ను స్వర్గము వైపునకు పంపుతూ ఇలా అన్నాడు “దానిని చూడు, మరియు దాని నివాసుల కొరకు నేను ఏమేమి తయారు చేసి ఉంచానో కూడా చూడు”. ఆయన స్వర్గానికి వెళ్ళి దానిని చూసాడు, మరియు అల్లాహ్ అందులో ఏమేమి తయారు చేసి ఉంచినాడో చూస్తాడు. (తిరిగి వచ్చి) జిబ్రయీల్ అలైహిస్సలాం ఇలా అంటాడు “నీ ఘనత సాక్షిగా, దాని గురించి విన్న వారు ఎవరైనా దాని లోనికి ప్రవేశించాలని తప్ప మరేమీ కోరుకోరు.” అల్లాహ్ తన ఆదేశముతో స్వర్గాన్ని (స్వర్గంలో చేరే మార్గాన్ని) కఠిన పరిస్థితులు, కష్టాలు, కడగండ్లు, శ్రమ, ప్రయాస మొదలైనవి చుట్టుకుని ఉండేలా చేసాడు. అపుడు (జిబ్రయీల్ అలైహిస్సలాంతో) అల్లాహ్ ఇలా అన్నాడు “తిరిగి వెళ్ళు, దానిని చూడు, మరియు దాని నివాసుల కొరకు నేను ఏమేమి తయారు చేసి ఉంచానో కూడా చూడు.” కనుక ఆయన (జిబ్రయీల్) స్వర్గానికి తిరిగి వెళ్ళాడు. స్వర్గము కఠిన పరిస్థితులు, కష్టాలు, కడగండ్లతో చుట్టుకుని ఉండడం చూసాడు. అతడు అల్లాహ్ వద్దకు వచ్చి ఇలా అన్నాడు “నీ ఘనత సాక్షిగా, ఎవరూ అందులోనికి ప్రవేశించలేరు.” అపుడు అల్లాహ్ ఆయనతో “నరకానికి వెళ్ళు, దానిని చూడు, మరియు దాని నివాసుల కొరకు నేను ఏమేమి తయారు చేసి ఉంచానో కూడా చూడు” అన్నాడు. ఆయన దానిని వెళ్ళి చూసాడు. (అది ఎన్నో భాగాలుగా ఉంది) దాని ఒక భాగము మరొక భాగముపై పేర్చబడి ఉన్నది. ఆయన తిరిగి వచ్చి “నీ ఘనత సాక్షిగా, ఎవరూ దానిలోనికి ప్రవేశించరు” అన్నాడు. అపుడు అల్లాహ్ తన ఆదేశముతో నరకాన్ని వాంఛలు, కోరికలు మొదలైనవి చుట్టుకుని ఉండేలా చేసాడు. తరువాత జిబ్రయీల్ అలైహిస్సలాంతో అల్లాహ్ ఇలా అన్నాడు “తిరిగి వెళ్ళు, దానిని చూడు, మరియు దాని నివాసుల కొరకు నేను ఏమేమి తయారు చేసి ఉంచానో కూడా చూడు.” ఆయన వెళ్ళి దానిని చూసాడు. అది వాంఛలు, కోరికలతో ఆవరించబడి ఉన్నది. ఆయన తిరిగి వచ్చి “నీ ఘనత సాక్షిగా! అందులోనికి వెళ్ళి పడిపోవడం తప్ప, దాని నుండి ఎవరూ తప్పించుకోలేరు అని భయంగా ఉన్నది” అన్నాడు.
హసన్ హదీథు. అబూదావూద్, అత్తిర్మిదీ మరియు అన్నసాయీ నమోదు చేసినారు:
“నేను నీటి కొలనుపై ఉంటాను, ఆ విధంగా మీలో ఎవరు నా వద్దకు వస్తారో చూస్తాను. కానీ కొంతమంది ప్రజలు నావద్దకు రాకుండా దూరంగా నిలిపి వేయబడతారు. నేను “ఓ ప్రభూ! వారు నా వాళ్ళు, నా సమాజం (ఉమ్మత్) వాళ్ళు” అని వేడుకుంటాను. దానికి “నీకు తెలుసా, నీ తరువాత వీరు ఏమేం చేసినారో?” అని సమాధానం ఇవ్వబడుతుంది. అల్లాహ్ సాక్షిగా వాళ్ళు వేగంగా తమ మడమలపై వెనుదిరిగి పోతారు”.
ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
“బిలాల్! ఇస్లాంలో నువ్వు చేసిన అత్యంత ఆశావహ ఆచరణ ఏమిటో నాకు చెప్పు, ఎందుకంటే నేను స్వర్గంలో నా ముందర నీ చెప్పుల సవ్వడి విన్నాను.” అతను చెప్పారు: “నా దృష్టిలో అత్యంత ఆశావహమైన ఆచరణ ఏమిటంటే, నేను రేయింబవళ్ళలో, ఏ గడియలోనైనా ఉదూ చేసుకున్నప్పుడు, ఆ ఉదూతో నాకు విధివ్రాతలో వ్రాయబడినంత నమాజ్ తప్పకుండా ఆచరిస్తాను.”
ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
"స్వర్గంలో వంద స్థాయిలు ఉంటాయి, ప్రతి రెండు స్థాయిల మధ్య ఆకాశం మరియు భూమి మధ్య దూరం అంత ఉంది. ఫిర్'దౌసు స్వర్గం అత్యున్నత స్థాయి స్వర్గం, మరియు దాని నుండి స్వర్గం యొక్క నాలుగు నదులు ఉద్భవిస్తాయి మరియు దాని పైనే అర్ష్ సింహాసనం ఉంది. కాబట్టి మీరు అల్లాహ్‌ను ఏదైనా అడిగినప్పుడు, ఆయనతో ఫిర్'దౌస్ స్వర్గాన్ని ప్రసాదించమని వేడుకోండి."
ప్రామాణికమైన హదీథు అత్తిర్మిదీ నమోదు చేసినారు:
“అనస్ బిన్ మాలిక్ రజియల్లాహు అన్హు మాతో ఇలా అన్నారు: “ఒక వ్యక్తి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ను ఇలా ప్రశ్నించాడు “ఓ ప్రవక్తా సల్లల్లాహు అలైహి వసల్లం ! తీర్పు దినమున అవిశ్వాసి తన ముఖము పై (నడిచేలా) ఎలా సమీకరించబడతాడు?” దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “ అతడిని ఈ భూమి మీద కాళ్ళపై నడిచేలా చేయగలిగిన శక్తిమంతుడు (అయిన అల్లాహ్), తీర్పు దినమున అతడిని ముఖముపై నడిచేలా చేయలేడా?” అన్నారు. ఖతాదహ్ ఇలా అన్నారు “అవును, మా ప్రభువు (అయిన అల్లాహ్) గౌరవం సాక్షిగా (ఆయన అలా చేయగల శక్తిశాలి)”.
ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
“ఒకసారి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం రెండు సమాధుల ప్రక్క నుండి వెళ్ళడం జరిగింది. ఆయన (అక్కడ ఆగి) ఇలా అన్నారు: “వీటిలో ఉన్నవారు శిక్షించబడుచున్నారు; కానీ పెద్ద పాపము చేసినందుకు కాదు. వారిలో ఒకడు మూత్రము (తనపై చిందుట) నుండి తనను తాను రక్షించుకునేవాడు కాడు, రెండవ వాడు జనుల పట్ల అపవాదులు ప్రచారం చేస్తూ ఉండేవాడు.” తరువాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెట్టు నుండి ఒక తాజా రెమ్మను తీసుకుని, దానిని రెండు భాగాలుగా చీల్చి, ఒక్కొక్క భాగాన్ని ఒక్కొక్క సమాధిపై ఉంచినారు. ఆయనతో ఉన్నవారు ఇలా అడిగారు: “ఓ రసూలుల్లాహ్! అలా ఎందుకు చేసినారు?” దానికి ఆయన “ఆ రెమ్మలు పచ్చగా (ఎండిపోకుండా) ఉన్నంత వరకు బహుశా వారి శిక్ష తగ్గించబడవచ్చు.”
ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
“నేను రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం తో ఇలా అన్నాను “మరి (నీటి హౌజు లోని ఆ నీటిని త్రాగే) కప్పుల మాటేమిటి?” దానికి ఆయన ఇలా అన్నారు: “ముహమ్మద్ యొక్క ప్రాణం ఎవరి చేతిలోనైతె ఉన్నదో ఆయన సాక్షిగా; మబ్బులు లేని నల్లని ఆకాశంలోని నక్షత్రాలకన్నా, అందులోని గ్రహాల కన్నా, ఆ కప్పులు మిక్కిలి అధిక సంఖ్యలో ఉంటాయి. అవి స్వర్గపు పాత్రలు. ఎవరైతే దాని నుండి (ఆ నీటి హౌజు నుండి) నీటిని త్రాగుతాడో, అతడు ఇంకెన్నడూ దాహానికి లోను కాడు. అందులో స్వర్గపు రెండు ధారలు ప్రవహిస్తూ ఉంటాయి. దాని నుండి నీటిని త్రాగిన వారెవ్వరికీ తిరిగి దాహం వెయ్యదు. ఆ నీటి తొట్టి వెడల్పు దాని పొడవు అంత ఉంటుంది; అమ్మాన్ మరియు ఆయిలహ్’ల మధ్య దూరమంత. దాని నీరు పాలకన్నా తెల్లగా మరియు తేనె కన్నా మధురంగా ఉంటాయి”.
ప్రామాణికమైన హదీథు ముస్లిం నమోదు చేసినారు:
“పునరుత్థాన దినమున తీర్పు చేయబడే మొదటి విషయం – అక్రమంగా చిందించబడిన రక్తము” (అన్యాయంగా, అధర్మంగా ఎవరినైనా చంపడం, హత్య చేయడం.)
ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు