Skip to content
సూరాల జాబితా /

الفَجر

الفَجر is chapter 89 of the Quran and has 30 verses. This page presents it in full in the Uthmani script, with a verse-by-verse translation of its meaning.

30 ఆయతులు సూరా సంఖ్య 89
ఆయత్‌కు వెళ్ళండి
తెలుగు · Muhammad
بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَٰنِ ٱلرَّحِيمِ

وَٱلۡفَجۡرِ

ప్రాంతః కాలం సాక్షిగా!

Explanation & meanings · 1
  1. అంటే ప్రతి ఉదయం ఒక ప్రత్యేక ఉదయం కాదు.

وَلَيَالٍ عَشۡرٖ

పది రాత్రుల సాక్షిగా!

Explanation & meanings · 1
  1. అంటే జు'ల్-'హజ్ యొక్క మొదటి పదిరాత్రులని చాలా మంది వ్యాఖ్యాతల అభిప్రాయం. వీటి ఘనత 'హదీస్' లలో ఉంది. దైవప్రవక్త ('స'అస) ప్రవచనం: "జు'ల్-'హజ్జ్ మొదటి పది రోజులలో చేసే సత్కార్యాలు అల్లాహ్ (సు.తా.)కు ఎంతో ఇష్టమైనవి - జిహాద్ కంటే కూడా - మానవుడు అమరగతి నొందిన జిహాద్ తప్ప! ('స'హీ'హ్ బు'ఖారీ).

وَٱلشَّفۡعِ وَٱلۡوَتۡرِ

సరి బేసీల సాక్షిగా!

وَٱلَّيۡلِ إِذَا يَسۡرِ

గడచిపోయే రాత్రి సాక్షిగా!

هَلۡ فِي ذَٰلِكَ قَسَمٞ لِّذِي حِجۡرٍ

వీటిలో బుద్ధిగల వాని కొరకు ఏ ప్రమాణమూ లేదా ఏమిటి?

Explanation & meanings · 1
  1. అంటే వీటన్నిటి ప్రమాణం చేయటం, అల్లాహ్ (సు.తా.)ను విశ్వసించటానికి చాలదా! 'హిజ్ రున్: ఆపటం, కాదనటం, బుద్ధి కూడా మానవుడిని చెడు కర్మల నుండి ఆపుతుంది.