أبو حامد محمد بن محمد بن محمد الغزَّالي
الإسم
అబూ హామిద్ ముహమ్మద్ బిన్ ముహమ్మద్ బిన్ ముహమ్మద్ అల్ గజ్జాలీ.
اسم الشهرة
అబూహామీద్ అల్ గజ్జాలీ
نبذة مختصرة
ముహమ్మద్ బిన్ ముహమ్మద్ బిన్ ముహమ్మద్ తూసి, అబూ హామిద్ అల్'గజ్జాలీ. ఇబ్నె సమ్'ఆనీ, ఇబ్నుల్ అసీర్, నవవి, ఇబ్ను-ఖల్లికాన్, ఇబ్నుదఖీక్ అల్'ఈద్, జహాబీ, సుబకీ, సఖావి మరియు ముర్తజా జబీదీలు 'గజ్జాలీ' అనే పదం ఒత్తు 'జ్జా'తో వ్రాశారు ఇదియేసరైనది. అయితే అందులో కొందరు భిన్నాభిప్రాయాలు కూడా వ్యక్తం చేశారు. ఆయన హిజ్రీ450వ సంవత్సరంలో జన్మించారు. గజ్జాలీ ఒక ఉసూలి, ఫఖీహ్ మరియు షాఫయీ. ఆయన చాలా పుస్తకాలు రాశారు.అందులో కొన్ని ఇవి: 'ఇహ్యావు ఉలూముద్దీన్', అల్' ముస్తస్ఫ ఫీ ఉసూలీల్ ఫిఖా' మరియు ఫిఖహ్ లో 'అల్ వజీజ్' మరియు 'అల్ వసీత్'వల్ బసీత్', మొదట తత్వశాస్త్రం యొక్క సూక్ష్మ నైపుణ్యాలలో మునిగి తరువాత అక్కడ నుండి తిరిగి వచ్చి దానిని తిరస్కరించారు. తరువాత ఇల్మే కలామ్ యొక్క సముద్రంలో మునిగి, దాని సూత్రాలు మరియు పాత్రలను నిర్దారించారు. ఆపై దాని అబద్ధం, వైరుధ్యం మరియు దాని జెండావహుల చర్చలు తెరపైకి వచ్చినప్పుడు దాని నుండి విముక్తి పొందారు. అతను తత్వశాస్త్రాన్ని తిరస్కరించిన రోజుల్లో ఇల్మ్-ఎ-కలామ్ పట్ల ఆసక్తిని కలిగి ఉన్నారు మరియు అదే సమయంలో అతనికి హుజ్జతల్-ఇస్లాం అనే బిరుదు కూడా ఇవ్వబడింది. ఎందుకంటే అతను తత్వవేత్తలను జవాబు లేకుండా చేశారు.అప్పుడు అతను బాతినియత్ మార్గంలో వెళ్లి దానికి సంబంధించిన జ్ఞానాన్ని పొందారు మరియు దానిని కూడా విస్మరించారు మరియు బాతినీ సమాజంలోని తప్పుడు అఖీదాల యొక్క అబద్ధాన్ని మరియు ఖుర్ఆను ఆయతులు మరియు హదీసుల అవహేళనను స్పష్టపరిచారు. ఆ తరువాత తసవ్వుఫ్ మార్గాన్ని అనుసరించారు.ఇబ్నుసలాహ్ ఇలా చెప్పారు:(అబూ హమీద్ గురించి చాలా విషయాలు చెప్పబడ్డాయి. అతను కూడా చాలా విషయాలు చెప్పాడు. అతని సత్యానికి వ్యతిరేకంగా ఉన్న పుస్తకాలకు సంబంధించినంత వరకు వాటిని పట్టించుకోవడం జరుగదు. ఈ వ్యక్తి విషయానికొస్తే, అతని గురించి ఏ అభిప్రాయం వ్యక్తం చేయబడదు అతని వ్యవహారం అల్లాహ్'కు అప్పగించబడుతుంది.)ఇమాం జహబీ ఇలా అన్నారు: (ఈ వ్యక్తి తత్వశాస్త్రాన్ని ఖండిస్తూ "అత్-తహాఫుత్" అనే పుస్తకాన్ని వ్రాసి వారి తప్పుడు చిట్టాలను విప్పాడు మరియు కొన్ని చోట్ల విషయాలు సరైనవని మరియు ఇస్లాంకు అనుగుణంగా ఉందని భావించి వారితో ఏకీభవించారు. అతని జ్ఞానానికి సరైన దిశానిర్దేశం చేసే హదీసుల విజ్ఞానం లేదా సున్నతే-నబవి జ్ఞానం లేదు, అతను చాలా శ్రద్ధతో "రసాఇల్ ఇఖ్వాన్ అస్-సఫా" అనే పుస్తకాన్ని చదివారు, ఇది చికిత్సలేని వ్యాధి, ప్రాణాంతక వ్యాధి. విషం. అయితే అబూహమీద్ అత్యంత తెలివైన మరియు నిజాయితీ గల వ్యక్తులలో లేకపోతే అతను నాశనం చేయబడి ఉండేవాడు. కావున అతని ఈ పుస్తకాల పట్ల ఎట్టి పరిస్థితుల్లోనూ జాగ్రత్తగా ఉండండి మరియు అతనిలాంటి వ్యక్తులు సృష్టించే సందేహాల నుండి మీ ధర్మాన్నికాపాడుకోండి. లేకుంటే మీరు కూడా సందేహాల సుడిగుండంలో చిక్కుకుంటారు.)అబూబకర్ ఇబ్నుల్ అరబీ ఇలా చెప్పారు:(మా షేఖ్ అబూ హమీద్ తత్వశాస్త్రాన్ని మింగేశాడు అయితే తరువాత వాటిని వాంతి చేయడానికి ప్రయత్నించాడు, కానీ సాద్యపడలేదు.) ఖాజీ అయాజ్ ఇలా అన్నారు:(షేక్ అబూ హమీద్ తప్పుడు జ్ఞానాన్ని ప్రచారం చేసేవాడు మరియు చెడు పుస్తకాలను రచించాడు. తసవ్వుఫ్ గురించి చాలా అతిశయోక్తి ప్రదర్శించాడు, దాని రక్షణలో బహిరంగంగా నిలబడి భోదకుడు అయ్యాడు. తసవ్వుఫ్ పై అతని ప్రసిద్ధ పుస్తకం అంటే అల్ ఇహ్యావు దీన్'వ్రాశాడు, అందులో చాలా చోట్ల పట్టుబడ్డాడు, చాలా మందికి అతని పై చెడు అభిప్రాయం ఉంది, అతనిలో ఏమున్నది అల్లాహ్కు బాగా తెలుసు. అతని ఈ పుస్తకాన్ని తగలబెట్టమని, దానికి దూరంగా ఉండాలని ఫత్వా వచ్చింది.దాని ప్రకారం అనుసరించబడింది.) ఇబ్నుల్ జౌజీ ఇలా చెప్పారు:(అబూ హమీద్ "ఇహ్యాఉ ఉలూమి ద్దీన్" అని పుస్తకాన్ని వ్రాసాడు అందులో కుప్పలుతెప్పలుగా తప్పుడు హదీసులు ప్రస్తావించాడు. ఈ హదీసులు అబద్ధమని కూడా అతనికి తెలియదు. అతను కష్ఫ్ గురించి మాట్లాడారు అయితే ఫిఖహ్ సూత్రాల నుండి తొలగిపోయారు.) హిజ్రీ 505వ సంవత్సరంలో మరణించారు.