أبو بكر الصديق عبد الله بن أبي قحافة عثمان بن عامر القرشي التيمي
الإسم
అబూ బకర్ అస్సిద్దీఖ్ అబ్దుల్లాహ్ బిన్ అబూఖుహాఫా ఉస్మాన్ బిన్ ఆమిర్ అల్ ఖురషి అత్తైమీ.
اسم الشهرة
అబూబకర్ అస్సిద్దీఖ్ రజియల్లాహు అన్హు.
نبذة مختصرة
అబూ బకర్ సిద్దీఖ్ అబ్దుల్లా బిన్ అబూ ఖుహాఫా ఉస్మాన్ బిన్ ఆమీర్ ఖుర్షీ అత్తైమి, అల్లాహ్ యొక్క ప్రవక్త- సల్లల్లాహు అలైహి వసల్లం తరువాత ఇస్లామిక్ నాయకత్వ పగ్గాలు చేపట్టిన మొదటి వ్యక్తి - స్వర్గానికి సంబంధించిన శుభవార్తలను పొందిన పది మంది సహాబాలలో ఒకరు. దైవప్రవక్త యొక్క గుహ సహచరులు - సల్లల్లాహు అలైహి వసల్లం.ప్రవక్తతో పాటు గుహలో ఉండడం గురించి కూడా అల్లాహ్ ఖుర్ఆన్ లో పేర్కొన్నాడు.అది ప్రళయం వరకు పఠించబడుతుంది.దైవప్రవక్త అతని కూతురిని పెళ్లి చేసుకున్నారు. అతను అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో అన్నీ యుద్ధాలలో పాల్గొన్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తరువాత ఈయన ఈ సమాజంలో అత్యంత ఉన్నతమైన వ్యక్తి. ప్రవక్త అనారోగ్యంతో ఉన్నప్పుడు మరియు మరణించినప్పుడు, ఆయన ప్రజలకు నమాజు చదివించారు. అల్లాహ్ యొక్క ప్రవక్త - సల్లల్లాహు అలైహి వసల్లం - అతని గురించి ఇలా అన్నారు:("తన సంపద మరియు సాంగత్యంతో నాకు సహకరించిన వ్యక్తులలో అబూబకర్ ఒకడు.ఒకవేళ నేను నా ప్రభువును మిత్రుడిగా చేసుకుని ఉండకపోతే అతను అబూ బకర్ ను ఖచ్చితంగా మిత్రుడిగా చేసుకునేవాడిని.కానీ మాకు ఇస్లాం యొక్క సోదరభావం మరియు స్నేహం సరిపోతుంది".) ఈ హదీస్ ను ఇమామ్ బుఖారీ ఉల్లేఖించారు.అతను హిజ్రీ 13వ సంవత్సరంలో మరణించారు.