أحمد بن عبد الحليم بن عبد السلام بن تيمية
الإسم
అహ్మద్ బిన్ అబ్దుల్ హలీం బిన్ అబ్దుస్సలాం బిన్ తైమియ.
اسم الشهرة
ఇబ్ను తైమియా
نبذة مختصرة
అహ్మద్ బిన్ అబ్దుల్'హలీం బిన్ అబ్దుస్సలాం బిన్ తైమియా అల్ హర్రానీ. షేఖుల్ ఇస్లాం, ఇమాం, ముజ్తహిద్ మరియు ముజద్దిద్. హిజ్రీ 661లో జన్మించారు. ధార్మిక మరియు మేధోపర జ్ఞానాలకు ఆయన ఒక మహాసముద్రం. శీఘ్రగ్రహణ, పదునైనతెలివిలో దైవసూచన ఆయన. తనను తఖియుద్దీన్'గా పిలవడం ఆయనకు నచ్చేదికాదు. అయినప్పటికీ తఖియుద్దీన్ మరియు షేఖుల్ ఇస్లాం అనే బిరుదులతో ప్రసిద్ధి చెందారు. అల్లామా ఇబ్నుదఖీఖ్ అల్ఈద్ ఆయన గురించి ఇలా చెప్పారు:(నేను ఇబ్నుతైమియాను కలిసినప్పుడు ఆ వ్యక్తిని చూశాను మొత్తం జ్ఞాన భాండాగారం అతని ఎదుట ఉంది తనకు కావలసినది అందులో నుండి తీసుకుంటాడు. కోరినది వదిలేస్తాడు.) హాఫిజ్ ఇబ్నుహజర్ ఇలా అన్నారు: (ఫిఖా చదివారు, అందులో ప్రావీణ్యం సంపాదించారు, ప్రత్యేకగుర్తింపును సంపాదించుకున్నారు. ఆపై ముందుకు సాగారు, అనేక పుస్తకాలు, రచనలు రాశారు. బోధనలు చేశారు ఫత్వాలు జారీచేశారు. ఆ విధంగా ఆ యుగపు ఇతర ఉలమాలను అధిగమించారు. హాజరు సమాధానం, దృఢ సంకల్పం, మతపరమైన, మేధోపరమైన జ్ఞానం మరియు పాత, కొత్త ఉలమాల అభిప్రాయ విభాగాల గురించి తెలుసుకోవడం వంటి విషయాలలో ఆశ్చర్యపరిచే లోతును కలిగి ఉన్నారు.) ఆయన అనేక పుస్తకాలు రాశారు. ఇమాం జహ్బీ ఇలా అన్నారు:(బహుశా ఈ కాలంలో ఆయన రచనలు 4000 లేదా అంతకంటే ఎక్కువ ఉండవచ్చు.) అతని పుస్తకాలలో కొన్ని ఈ క్రింది విధంగా ఉన్నాయి: "దర్ఉ త్తఆరుజిల్అఖ్లి వ న్నఖ్ల్". "మిన్హాజు స్సున్నహ్ అన్నబవియ్యహ్". "అల్'ఇస్తిఖామ". "అల్'జవాబుస్సహీహ్ లిమన్ బద్దల దీనుల్ మసీహ్". "బయాను తల్బీసుల్ జహ్మియా". "ఇఖ్తిజావు సిరాతుల్ ముస్తఖీమ్ లి ముఖాలఫతి అస్'హాబుల్ జహీమ్". ఆయన హిజ్రీ 728లో కన్నుమూసారు.