أبي بن كعب بن قيس بن عبيد الأنصاري
الإسم
ఉబై బిన్ కఅబ్ బిన్ ఖైస్ బిన్ ఉబైద్ అల్ ఆన్సారీ.
اسم الشهرة
ఉబై బిన్ కఅబ్ రజియల్లాహు అన్హు.
نبذة مختصرة
అబుల్'ముంజిర్ మరియు అబూతుఫైల్, ఉబై బిన్ కఅబ్ బిన్ ఖైస్ బిన్ ఉబైద్ అల్ అన్సారీ, అల్'ఖజ్రజి విద్యావంతులైన ఉలమా సహాబీలలోని ఒక గొప్పసహాబీ. ఉమర్ రజియల్లాహు అన్హు ఇలా అన్నారు:(ఉబయ్ ముస్లింలకు సర్దారు.)స్వయంగా దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతనిని ఇలా అడిగారు: "ఓ అబుల్ ముంజిర్! నీ వద్ద ఉన్న అల్లాహ్ గ్రంధంలో ఏ ఆయతు గొప్పదో నీకు తెలుసా?" అతను ఇలా జవాబిచ్చారు: అల్లాహ్ మరియు దైవ ప్రవక్తకి తెలుసు. అప్పుడు మళ్ళీ అడిగారు: "ఓ అబుల్-ముంజిర్! మీ వద్ద ఉన్న అల్లాహ్ గ్రంధంలోని ఏ ఆయతు గొప్పదో మీకు తెలుసా?" అతను ఇలా జవాబిచ్చారు: {الله لا إله إلا هو الحي القيوم} ఇది విన్నప్పుడు ప్రవక్త నా ఛాతీని కొట్టి ఇలా దుఆ చేశారు :«والله ليهنك العلم أبا المنذر» "ఓ అబుల్ ముంజిర్! నీ ఈ జ్ఞానానికి శుభాకాంక్షలు". దైవప్రవక్త అతనితో ఇలా అన్నారు: మీకు ఈ ఆయతు చదివి వినిపించమని అల్లాహ్ నాకు ఆదేశించాడు:{لم يكن الذين كفروا من أهل الكتاب}." ఇది విన్న అతను ఇలా అడిగారు: అల్లాహ్ నిజంగా నా పేరు తీసుకున్నాడా? ప్రవక్త 'సమాధానం ఇస్తూ అవును'అన్నారు" సమాధానం విని ఏడ్చారు. ఆయన మరణించిన సంవత్సరం గురించి చాలా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కొందరు 19 హిజ్రీ అని, కొందరు 20 హిజ్రీ అని, మరికొందరు 32 హిజ్రీ అని తెలిపారు.