أحمد بن محمد بن حنبل الشيباني الإمام
الإسم
అహ్మద్ బిన్ ముహమ్మద్ బిన్ హంబల్ అష్షైబానీ అల్ ఇమామ్
اسم الشهرة
అహ్మద్ బిన్ హంబల్
نبذة مختصرة
ఇమాం అబూ అబ్దుల్లాహ్ అహ్మద్ బిన్ ముహమ్మద్ బిన్ హంబల్ అష్షైబానీ. హిజ్రీ 164లో జన్మించారు. ఇస్లాం యొక్క గొప్ప ఇమాములలో ఒకరు. ఆయనకి సంబంధించిన అనేక విషయాలు చాలా ప్రసిద్ధి చెందాయి. ఇమాం షాఫయీ ఆయన గురించి ఇలా అన్నారు: (అహ్మద్ ఎనిమిది శాస్త్రాలలో ఆరితేరిన ఇమాం. ఆయన హదీసు యొక్క ఇమాం, ఆయన ఫిఖాలో ఇమాం, భాషలో ఇమాం, ఖుర్ఆనులో ఇమాం, పేదరికంలో ఇమాం, భక్తిలో ఇమాం, పవిత్రతలో ఇమాం మరియు సున్నతులో ఇమాం.) ఖుర్ఆను సృష్టియా కాదా అనే అంశంపై తన అభిప్రాయం పై విశ్వాసం మీద నిలబడి, చిత్రహింసలను భరించారు, ఇది ఆయన జ్ఞానం మరియు సహనానికి చిహ్నం. ఈ సంఘటన తరువాత, అతను అహ్లేసున్నతు యొక్క ఇమాం అనే బిరుదును పొందారు. బిద్అతు సర్వత్రా వ్యాపించిన సమయంలో సున్నతును బలోపేతం చేయడానికి ఆయన తీవ్రమైన కృషి చేశారని దీని అర్థం. ఈ కోణంలో ఇతర వ్యక్తులు అహ్లేసున్నతు ఇమాం అనే బిరుదును పొందారు. దీనికి విరుద్ధంగా బిద్అతు ఇమాములు ఉన్నారు వారు బిద్అతును పుట్టించేవారు దాన్నివ్యాప్తి చేసేవారు. అయితే ఉలమాలకు సున్నతు ఆపాదించడమనేది వారు సున్నతు ప్రకారం ఆచరించడం మరియు దాని ప్రచారం కారణంగా ఉంటుంది. అయితే బిద్అతి ఉలమాల పట్ల బిద్అత్ యొక్క ఆపాదన వాటిని పుట్టించడం ఆచరించడం కారణంగా ఉంటుంది. ఇమాం అహ్మద్ యొక్క కొన్ని రచనలు ఇవి:"అల్ ముస్నద్","అజ్జుహద్","అల్ అష్'రిబా","రిసాలతు ఫీ మసీవు సలాతిహీ","అర్రద్దు అలా అజ్జనాదిఖ వల్ జహ్మియ్య " మొదలైనవి. ఆయన శిష్యులు అతని నుండి దాదాపు 60 వేల (మసాయిల్) ప్రశ్నోత్తరాలు సమీకరించారు. షరీఅతు యొక్క (ఉసూల్ వల్ ఫురూ) మూలసూత్రాలు మరియు ఉపఆదేశాలకు సంబంధిత విషయంలో ఆయన మస్లక్ స్థిరంగా ఉంది.హిజ్రీ 241వ సంవత్సరంలో ఆయన కన్నుమూశారు.