Skip to content
837 హదీసులు

ప్రవక్త హదీసుల విజ్ఞాన సర్వస్వం

ఫలితాలను ఫిల్టర్ చేయండి

837 లో 12 కార్డులు

ఫిల్టర్లను తీసివేయి
“ఒక వ్యక్తి ఉన్నాడు; నాకు తెలిసినంతవరకు, మస్జిదు నుండి అతని ఇల్లు ఉన్నంత దూరంగా ఇల్లు కలిగిన వారెవరూ నాకు తెలియదు. అతను ఎప్పుడూ జమా’అత్ తో నమాజును ఆచరించుటను కోల్పోలేదు. అతనితో ఇలా అనబడింది, లేదా నేనే అతనితో బహుశా ఇలా అని ఉంటాను: “మీరు ఒక గాడిదను కొనుక్కుంటే బాగుండేది, చీకటి రాత్రులలో, మండే ఇసుకలో దానిపై ఎక్కి రావడం తేలికగా ఉంటుంది.” దానికి అతడు ఇలా అన్నాడు “నా ఇల్లు మస్జిదు ప్రక్కన ఉండడం నాకు ఇష్టం లేదు, ఎందుకంటే నేను మస్జిదుకు వచ్చినపుడు మరియు (మస్జిదు నుండి) తిరిగి ఇంటికి నా కుటుంబం వద్దకు వెళ్ళినపుడు నేను వేసే అడుగులు లెక్కించబడి నమోదు చేయబడాలని నేను కోరుకుంటున్నాను.” అది విని రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “నిశ్చయంగా అల్లాహ్ వాటినన్నింటినీ నీ కొరకు సేకరించినాడు.”
ప్రామాణికమైన హదీథు ముస్లిం నమోదు చేసినారు:
నేను రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లంతో ఉండగా ‘అల్ హౌలాఅ బింత్ తువైత్ ఇబ్న్ హబీబ్ ఇబ్న్ అబ్దిల్ ఊజ్జా’ నా వద్దకు వచ్చి వెళ్ళినది. నేను రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లంతో “ఆమె హౌలాఅ బింత్ తువైత్, ఆమె రాత్రుళ్లు (ఇబాదత్’లో) అసలు నిద్రపోదు అని ఆమెను గురించి చెప్పుకుంటారు” అన్నాను. అప్పుడు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “: “ఓహ్, ఆమె (ఇబాదత్’లో) రాత్రిపూట నిద్రపోదా! మీరు అనునిత్యం చేయగలిగే ఒక ఆచరణను ఎంచుకొండి; అల్లాహ్ సాక్షిగా, మీరు (మంచి పనులు చేయడంలో) అలసిపోనంత వరకు అల్లాహ్ కూడా (ప్రతిఫలం ప్రసాదించడంలో) అలసిపోడు."
ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
“అల్లాహ్ యొక్క దాసుడు ఒకవేళ వ్యాధిగ్రస్తుడై ఉన్నా లేదా ప్రయాణంలో ఉన్నా, అతడు స్థానికంగా ఉన్నపుడు లేదా ఆరోగ్యంగా ఉన్నపుడు చేసే మంచిపనులకు సమానంగా అతని కొరకు ప్రతిఫలం వ్రాయబడుతుంది”.
ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ నమోదు చేసినారు:
"మీకు పూర్వం గతించిన ప్రజలలో ఒక రాజు ఉండేవాడు, అతని వద్ద ఒక ఆస్థాన మాంత్రికుడు ఉండేవాడు, ఆ మాంత్రికుడు వృద్ధాప్యానికి చేరుకోవడంతో, అతడు తన రాజుతో ఇలా అన్నాడు: “నిశ్చయంగా నేను వృద్ధుడను అయ్యాను. నా వద్దకు ఒక యువకుడిని పంపించండి, నేను అతనికి నా మంత్రజాల విద్య నేర్పిస్తాను.” అపుడు రాజు ఆ మంత్రజాల విద్యను నేర్పేందుకు ఒక యువకుడిని మాంత్రికుని వద్దకు పంపాడు. ఆ యువకుడు మాంత్రికుడి వద్దకు వెళుతున్న దారిలో ఒక రాహిబ్ (ఏకదైవాధన చేసే ఒక అల్లాహ్ దాసుడు) ఉండేవాడు. ఆ యువకుడు ఆ రాహిబ్ దగ్గర కూర్చుని అతని మాటలు విన్నాడు. అతనికి ఆ రాహిబ్ మాటలు బాగా నచ్చాయి. తరువాత రోజులలో ఎప్పుడు అతడు ఆ మాంత్రికుని దగ్గరకు వెళ్ళుతున్నా, దారిలో ఆ రాహిబ్ వద్ద కొద్దిసేపు కూర్చుని, అతడి మాటలు వినేవాడు. ఆ కారణంగా మాంత్రికుని దగ్గరకు ఆలస్యంగా వెళ్ళేవాడు. ఆలస్యంగా వచ్చినందుకు ఆ మాంత్రికుడు అతడిని దండించేవాడు. దానితో, ఆ యువకుడు దీని గురించి రాహిబ్ కు తెలుపగా, ఆ రాహిబ్ అతనితో ఇలా అన్నాడు: నీవు మాంత్రికుడికి భయపడినప్పుడల్లా, మీ కుటుంబం నిన్ను ఆపిందని చెప్పు. మరియు నీవు నీ కుటుంబానికి భయపడినప్పుడల్లా, మాంత్రికుడు నిన్ను ఆపినాడని వారికి చెప్పు. ఆ యువకుడు (కొంతకాలం) అలాగే కొనసాగాడు. అప్పుడు ఒకసారి దారిలో ఒక పెద్ద, భయంకరమైన మృగం అతడికి కనిపించింది మరియు ప్రజలు భయంతో దానిని దాటుకుని వెళ్ళలేకపోవడం అతడు చూసాడు. అపుడు ఆ యువకుడు: “ఈ రోజు నాకు తెలిసిపోతుంది – ఆ మాంత్రికుడు గొప్పవాడో, లేక ఆ రాహిబ్ గొప్పవాడో” అని అనుకుని అతడు ఒక రాయిని చేతిలోనికి తీసుకుని ఇలా అన్నాడు: “ఓ అల్లాహ్! ఆ రాహిబ్ వ్యవహారం నీకు మాంత్రికుడి వ్యవహారం కంటే ప్రియమైనదైతే, ప్రజలు స్వేచ్ఛగా తిరగగలిగేలా ఈ జంతువును చంపు.” తరువాత అతను ఆ రాయిని దాని వైపు విసిరాడు. దానితో ఆ జంతువు చనిపోయింది. ప్రజలు (దారిలో స్వేచ్ఛగా) తిరగడం ప్రారంభించారు. అతను ఆ రాహిబ్ వద్దకు వచ్చి అతనికి జరిగిన విషయం చెప్పాడు. అపుడు రాహిబ్ ఇలా అన్నాడు: “కుమారా! ఈ రోజు నువ్వు నా కంటే ఉన్నతుడివి అయ్యావు. నీ వ్యవహారం త్వరలోనే నిన్ను విచారణకు గురిచేసే దశకు చేరుకుంది, ఒకవేళ నీవు విచారణను ఎదుర్కొంటే నా గురించి వారికి చెప్పకు.” తరువాత ఆ యువకుడు పుట్టుగుడ్డి వారికి, కుష్టు వ్యాధి వారికి మరియు ఇతర వ్యాధులతో బాధపడుతున్న ప్రజలకు చికిత్స చేసేవాడు. రాజు దగ్గర పనిచేసే ఒకతను చూపు పోయి అంధుడిగా మారిపోయాడు. అతడు ఆ బాలుడి గురించి విన్నాడు. అతను ఆ బాలుని వద్దకు వచ్చి, అతని కొరకు చాలా బహుమతులు తెచ్చి ఇలా అన్నాడు: "నీవు నన్ను నయం చేస్తే ఈ బహుమతులన్నీ నీవే". దానికి ఆ బాలుడు ఇలా జవాబిచ్చాడు: "నేను ఎవరికీ నయం చేయను; అల్లాహ్ మాత్రమే ప్రజలను నయం చేస్తాడు. కాబట్టి, మీరు అల్లాహ్ ను విశ్వసించినట్లైతే, నేను మీ కొరకు ఆయనను వేడుకుంటాను (దుఆ చేస్తాను) మరియు ఆయన మిమ్మల్ని నయం చేస్తాడు". దానితో, అతను అల్లాహ్ ను విశ్వసించాడు, మరియు అల్లాహ్ అతన్ని నయం చేశాడు. తరువాత, అతడు రాజు వద్దకు వచ్చి తాను ముందు కూర్చున్న స్థానంలో కూర్చున్నాడు. రాజు అతనితో ఇలా అన్నాడు: "నీకు చూపును ఎవరు తిరిగి ఇచ్చారు?". అతడు ఇలా జవాబిచ్చాడు: "నా ప్రభువు!". అప్పుడు రాజు ఇలా అన్నాడు: "నేను కాకుండా నీకు మరొక ప్రభువు ఉన్నాడా?" ఆ సహచరుడు ఇలా అన్నాడు: "నీ ప్రభువు మరియు నా ప్రభువు అల్లాహ్’యే". రాజు అతడిని తీసుకెళ్లి విపరీతంగా హింసించాడు. దానితో అతడు ఆ యువకుడి గురించి చెప్పాడు. అపుడు ఆ యువకుడిని రాజు వద్దకు తీసుకువచ్చారు, రాజు అతనితో ఇలా అన్నాడు: "ఓ యువకుడా! నీ మంత్రవిద్య పుట్టుకతో వచ్చే అంధత్వం, కుష్టు వ్యాధి మరియు ఇతర వ్యాధులను నయం చేసేంత వరకు చేరుకుంది". దానికి ఆ యువకుడు ఇలా అన్నాడు: "నిజంగా, నేను ఎవరినీ నయం చేయను. అల్లాహ్ మాత్రమే నయం చేయగలడు." ఆ మాటలకు రాజు అతడిని విపరీతంగా హింసించాడు. దానితో అతడు రాహిబ్ గురించి చెప్పేసాడు. తరువాత రాహిబ్ ను రాజు వద్దకు తీసుకువచ్చారు, రాజు అతనితో ఇలా అన్నాడు: "నీ ధర్మాన్ని వదులుకో”. దానికి రాహిబ్ నిరాకరించాడు. రాజు ఒక రంపాన్ని తీసుకురమ్మని ఆఙ్ఞాపించాడు. అది తీసుకు వచ్చిన తరువాత దానిని రాహిబ్ తల మధ్యలో ఉంచి ఒక భాగం నేలపై పడిపోయే వరకు అతడి శరీరాన్ని నిలువుగా రెండు ముక్కలుగా చీల్చాడు. తరువాత రాజు ఆ సహచరుడిని తీసుకువచ్చి అతనితో ఇలా అన్నాడు: "నీ ధర్మం నుండి మరలిపో". అతను అలా చేయడానికి నిరాకరించాడు. రాజు ఆ రంపాన్ని అతని తల మధ్యలో ఉంచి, ఒక భాగం పడిపోయే వరకు నిలువుగా రెండు ముక్కలుగా చీల్చాడు. అప్పుడు ఆ బాలుడిని తీసుకువచ్చి అతనితో ఇలా అన్నాడు: "నీ ధర్మం నుండి మరలిపో". అతను అలా చేయడానికి నిరాకరించాడు. రాజు అతన్ని తన అనుచరులలో కొద్ది మందికి అప్పగించి, వారితో ఇలా అన్నాడు: అతన్ని ఫలానా పర్వతానికి తీసుకెళ్లండి; అతన్ని ఆ పర్వతం పైకి ఎక్కించండి మరియు మీరు దాని శిఖరానికి చేరుకున్నప్పుడు (అతని విశ్వాసాన్ని త్యజించమని అడగండి) కానీ అతను అలా చేయడానికి నిరాకరిస్తే, అతన్ని (పర్వతం నుండి క్రిందకు) విసిరేయండి. వారు అతన్ని తీసుకొని ఆ పర్వతం పైకి తీసుకు వెళ్ళారు, అపుడు ఆ యువకుడు ఇలా అన్నాడు: "ఓ అల్లాహ్! నీవు ఏ విధంగా ఇష్టపడితే ఆ విధంగా వారి నుండి నన్ను రక్షించు". దానితో పర్వతం కంపించడం ప్రారంభించింది మరియు వారందరూ పడిపోయారు. ఆ యువకుడు రాజు వద్దకు నడుచుకుంటూ వచ్చాడు. రాజు అతనితో ఇలా అన్నాడు: “నీ వెంట వచ్చిన వారికి ఏమైంది?” అతను ఇలా అన్నాడు: “అల్లాహ్ నన్ను వారి నుండి రక్షించాడు.” రాజు మళ్ళీ అతనిని కొంతమంది సిబ్బందికి అప్పగించి ఇలా అన్నాడు: “అతన్ని ఒక చిన్న పడవలో తీసుకుని వెళ్ళండి, మీరు సముద్రం మధ్యలోకి చేరుకున్నప్పుడు (అతని ధర్మాన్ని త్యజించమని అడగండి), కానీ అతను తన ధర్మాన్ని త్యజించకపోతే అతన్ని నీటిలోకి విసిరేయండి”. వారు అతనిని పడవలో తీసుకుని వెళ్లారు. ఆ యువకుడు ఇలా అన్నాడు: “ఓ అల్లాహ్! వారి నుండి మరియు వారు ఏమి చేయాలనుకుంటున్నారో దాని నుండి నన్ను రక్షించు.” త్వరలోనే పడవ తిరగబడింది మరియు వారు మునిగిపోయారు. ఆ యువకుడు రాజు వద్దకు నడుచుకుంటూ వచ్చాడు. రాజు అతనితో ఇలా అన్నాడు: “నీ వెంట వెళ్ళిన వారికి ఏమయ్యింది?” అతను ఇలా అన్నాడు: “అల్లాహ్ నన్ను వారి నుండి రక్షించాడు." మరియు అతను రాజుతో ఇలా అన్నాడు: “నేను చెప్పినట్లు చేస్తే తప్ప నువ్వు నన్ను చంపలేవు.” రాజు అడిగాడు: "అది ఏమిటి?" ఆ యువకుడు ఇలా అన్నాడు: "ప్రజలను ఒక ఎత్తైన ప్రదేశంలో సమావేశ పరచి, నన్ను ఒక చెట్టుకు కట్టివేయండి; తరువాత నా అంబుల పొది నుండి ఒక బాణం తీసుకొని ఇలా అనండి: “ఈ బాలుడి ప్రభువు అయిన అల్లాహ్ నామముతో (ఈ బాణాన్ని వదులుతున్నాను).” ఇలా చేస్తేనే, నీవు నన్ను చంపగలవు”. అపుడు రాజు ఆ యువకుడు చెప్పిన ప్రకారం చేసాడు. బాణాన్ని విల్లులో ఉంచి “ఈ బాలుని ప్రభు నామముతో (బాణాన్ని వదులుతున్నాను)” అంటూ బాణాన్ని వదిలాడు. ఆ బాణం యువకుడి కణతను తాకింది, ఆ యువకుడు తన చేతిని బాణం గాయంపై ఉంచి చనిపోయాడు. అది చూసి ప్రజలు (ఒక్కసారిగా) ఇలా ప్రకటించారు: “మేము ఆ యువకుడి ప్రభువును విశ్వసిస్తున్నాము! మేము యువకుడి ప్రభువును విశ్వసిస్తున్నాము! మేము యువకుడి ప్రభువును విశ్వసిస్తున్నాము!” అప్పుడు రాజుతో ఇలా అనబడింది: "ఏమి జరిగిందో మీరు చూశారా? మీరు భయపడినదే జరిగింది. అల్లాహ్ సాక్షిగా ప్రజలందరూ (ఆ యువకుడి ప్రభువును) విశ్వసించినారు. దానితో ఆ రాజు రహదారుల ప్రవేశ ద్వారాల వద్ద పెద్దపెద్ద గోతులు తవ్వమని ఆదేశించగా, అలా గోతులు తవ్వడం జరిగింది. వాటిలో మంటలు రాజేయబడ్డాయి. అప్పుడు రాజు ఇలా ఆదేశించాడు “ఎవరైతే నా ధర్మాన్ని విడిచి పెట్టారో వారిని ఈ మంటలలో త్రోసివేయండి, లేదా అలాంటి వాళ్ళని ఈ మంటల్లో దూకమని ఆదేశించండి.” వారు అలాగే చేసారు. అప్పుడు, ఒక స్త్రీ మరియు ఆమె పసిబిడ్డ వచ్చారు, ఆ స్త్రీ అగ్నిలో దూకటానికి కొంత సంకోచిస్తుండగా, ఆమె పసిబిడ్డ ఆమెతో ఇలా చెప్పింది: “అమ్మా! సహనం వహించు (అగ్నిలో దూకు), ఎందుకంటే నిజంగా, నీవు సత్యాన్నే అనుసరిస్తున్నావు”.
ప్రామాణికమైన హదీథు ముస్లిం నమోదు చేసినారు:
“మానవుల శరీరంలో ప్రతి కీలు కొరకు, సూర్యుడు ఉదయించే దినాలలోని ప్రతి దినమూ, ఒక దానము (చేయవలసి) ఉంది. ఇద్దరు వ్యక్తుల మధ్య న్యాయం చేయడం ఒక దానం అవుతుంది; ఒక వ్యక్తికి అతని వాహనం విషయములో – అతడు దాని పైకి ఎక్కుటలో గానీ, లేక అతని ప్రయాణ సామాగ్రిని వాహనం పైకి చేరవేయుటలోగానీ సహాయపడుట ఒక దానం అవుతుంది; ఒక మంచి మాట దానం అవుతుంది; జమా’అత్ తో సలాహ్ (నమాజు) ఆచరించుటకు వేసే ప్రతి అడుగూ దానం అవుతుంది; మరియు మార్గం నుండి హానికరమైన వస్తువులను తొలగించడం అనేది ఒక దానం అవుతుంది.”
ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
“అబూ తాలిబ్ చనిపోయే సమయాన నేను అక్కడే ఉన్నాను. రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం అక్కడికి వచ్చారు. ఆయన వద్ద అప్పటికే అబూ జహ్ల్ మరియు అబ్దుల్లాహ్ ఇబ్న్ అబీ ఉమయ్యహ్ ఇబ్న్ అల్ ముఘీరహ్ ఉండడం గమనించారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “ఓ చిన్నాన్న, “లా ఇలాహ ఇల్లల్లాహ్” (అల్లాహ్ తప్ప నిజ ఆరాధ్యుడు వేరే ఎవ్వరూ లేరు) అను. ఈ ఒక్క మాట ద్వారా నీ కొరకు నేను అల్లాహ్ ను వేడుకుంటాను” అపుడు అబూ జహ్ల్ మరియు అబ్దుల్లాహ్ అబీ ఉమయ్యహ్ ఇలా అన్నారు “(ఓ అబూ తాలిబ్!) ఏం, అబ్దుల్ ముత్తలిబ్ ధర్మాన్ని విడనాడుతావా నువ్వు?” రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం విడువకుండా (షహాదహ్ పదాలు పలుకమని) పేర్కొంటూనే ఉన్నారు. వారు కూడా తమ మాటలను పునరావృతం చేస్తూనే ఉన్నారు. చివరికి, అబూ తాలిబ్ “లా ఇలాహా ఇల్లల్లాహ్” అని పలుకడానికి నిరాకరిస్తూ, తన చివరి మాటగా “నేను అబ్దుల్ ముత్తలిబ్ ధర్మం మీదనే చనిపోతాను” అన్నాడు (అని ప్రాణం విడిచాడు). ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు “అల్లాహ్ సాక్షిగా! (చెబుతున్నాను), నేను వారించబడనంత వరకూ నేను నీ క్షమాభిక్ష కొరకు ప్రార్థిస్తూనే ఉంటాను”. అపుడు అల్లాహ్ ఈ ఆయతును అవతరింపజేసాడు: { مَا كَانَ لِلنَّبِيِّ وَالَّذِينَ آمَنُوا أَنْ يَسْتَغْفِرُوا لِلْمُشْرِكِينَ} {అల్లాహ్’కు సాటి కల్పించే వారు (ముష్రికులు) దగ్గరి బంధువులైనా, వారు నరకవాసులని వ్యక్తమైన తరువాత కూడా, ప్రవక్తకు మరియు విశ్వాసులకు వారి క్షమాపణకై ప్రార్థించుట తగదు.} [సూరహ్: అత్-తౌబహ్ 9:113]. మరియు అబూ తాలిబ్’ను గురించి, రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం కొరకు, అల్లాహ్ ఈ ఆయతును అవతరింపజేసినాడు: { إِنَّكَ لا تَهْدِي مَنْ أَحْبَبْتَ وَلَكِنَّ اللهَ يَهْدِي مَنْ يَشَاءُ} { (ఓ ప్రవక్తా!) నిశ్చయంగా నీవు, నీకు ఇష్టమైన వారికి మార్గదర్శకం చేయలేవు. కానీ అల్లాహ్ తాను కోరిన వారికి మార్గదర్శకం చేస్తాడు. మరియు ఆయనకు మార్గదర్శకం పొందే వారెవరో బాగా తెలుసు} [సూరహ్ అల్ ఖసస్ 28:56].
ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
"మనిషిలోని ప్రతి కీలుపై ఒక దానం (సదఖా) ఉంది. సూర్యుడు ఉదయించే ప్రతి రోజు, ఇద్దరు వ్యక్తుల మధ్య న్యాయం చేయడం ఒక దానం. ఒక వ్యక్తి తన వాహనంపై ఎక్కడానికి సహాయం చేయడం, లేదా అతని సామాను దానిపై ఎక్కించడంలో సహాయం చేయడం ఒక దానం. మంచి మాట ఒక దానం. నమాజ్ కోసం నీవు వేసే ప్రతి అడుగు ఒక దానం. మరియు దారిలో ఉన్న హాని కలిగించే వస్తువును తొలగించడం కూడా ఒక దానం."
ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు:
“ఒక ప్రయాణములో మేము రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వెంట ఉన్నాము. అపుడు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం కాలకృత్యాలు తీర్చుకోవడానికి వెళ్ళినారు. అప్పుడే మేము హమ్మారా అనే పక్షిని దాని రెండు పిల్లలతో చూసాము. మేము దాని పిల్లలను పట్టుకున్నాము. ఆ పక్షి వచ్చి దాని రెక్కలు ఆడించడం ప్రారంభించింది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తిరిగి వచ్చి, అది చూసి: “ఈ పక్షి తన బిడ్డ కోసం దుఃఖపడేలా చేసింది ఎవరు? ఆమె బిడ్డను ఆమెకు తిరిగి ఇవ్వండి” అన్నారు. తరువాత ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం మేము కాల్చివేసిన ఒక చీమల పుట్టను చూసి: “దీనిని ఎవరు కాల్చారు?” అని అడిగినారు. దానికి మేము: “మేము కాల్చినాము” అన్నాము. దానికి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం: “నరకాగ్ని యొక్క ప్రభువైన అల్లాహ్ తప్ప ఎవ్వరూ అగ్నితో శిక్షించకూడదు” అన్నారు.
ప్రామాణికమైన హదీథు అబూదావూద్ నమోదు చేసినారు: