Skip to content
837 హదీసులు

ప్రవక్త హదీసుల విజ్ఞాన సర్వస్వం

ఫలితాలను ఫిల్టర్ చేయండి

837 లో 6 కార్డులు

ఫిల్టర్లను తీసివేయి
“ఒక వ్యక్తి ఉన్నాడు; నాకు తెలిసినంతవరకు, మస్జిదు నుండి అతని ఇల్లు ఉన్నంత దూరంగా ఇల్లు కలిగిన వారెవరూ నాకు తెలియదు. అతను ఎప్పుడూ జమా’అత్ తో నమాజును ఆచరించుటను కోల్పోలేదు. అతనితో ఇలా అనబడింది, లేదా నేనే అతనితో బహుశా ఇలా అని ఉంటాను: “మీరు ఒక గాడిదను కొనుక్కుంటే బాగుండేది, చీకటి రాత్రులలో, మండే ఇసుకలో దానిపై ఎక్కి రావడం తేలికగా ఉంటుంది.” దానికి అతడు ఇలా అన్నాడు “నా ఇల్లు మస్జిదు ప్రక్కన ఉండడం నాకు ఇష్టం లేదు, ఎందుకంటే నేను మస్జిదుకు వచ్చినపుడు మరియు (మస్జిదు నుండి) తిరిగి ఇంటికి నా కుటుంబం వద్దకు వెళ్ళినపుడు నేను వేసే అడుగులు లెక్కించబడి నమోదు చేయబడాలని నేను కోరుకుంటున్నాను.” అది విని రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “నిశ్చయంగా అల్లాహ్ వాటినన్నింటినీ నీ కొరకు సేకరించినాడు.”
ప్రామాణికమైన హదీథు ముస్లిం నమోదు చేసినారు:
“అల్లాహ్ యొక్క దాసుడు ఒకవేళ వ్యాధిగ్రస్తుడై ఉన్నా లేదా ప్రయాణంలో ఉన్నా, అతడు స్థానికంగా ఉన్నపుడు లేదా ఆరోగ్యంగా ఉన్నపుడు చేసే మంచిపనులకు సమానంగా అతని కొరకు ప్రతిఫలం వ్రాయబడుతుంది”.
ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ నమోదు చేసినారు:
“మానవుల శరీరంలో ప్రతి కీలు కొరకు, సూర్యుడు ఉదయించే దినాలలోని ప్రతి దినమూ, ఒక దానము (చేయవలసి) ఉంది. ఇద్దరు వ్యక్తుల మధ్య న్యాయం చేయడం ఒక దానం అవుతుంది; ఒక వ్యక్తికి అతని వాహనం విషయములో – అతడు దాని పైకి ఎక్కుటలో గానీ, లేక అతని ప్రయాణ సామాగ్రిని వాహనం పైకి చేరవేయుటలోగానీ సహాయపడుట ఒక దానం అవుతుంది; ఒక మంచి మాట దానం అవుతుంది; జమా’అత్ తో సలాహ్ (నమాజు) ఆచరించుటకు వేసే ప్రతి అడుగూ దానం అవుతుంది; మరియు మార్గం నుండి హానికరమైన వస్తువులను తొలగించడం అనేది ఒక దానం అవుతుంది.”
ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
"మనిషిలోని ప్రతి కీలుపై ఒక దానం (సదఖా) ఉంది. సూర్యుడు ఉదయించే ప్రతి రోజు, ఇద్దరు వ్యక్తుల మధ్య న్యాయం చేయడం ఒక దానం. ఒక వ్యక్తి తన వాహనంపై ఎక్కడానికి సహాయం చేయడం, లేదా అతని సామాను దానిపై ఎక్కించడంలో సహాయం చేయడం ఒక దానం. మంచి మాట ఒక దానం. నమాజ్ కోసం నీవు వేసే ప్రతి అడుగు ఒక దానం. మరియు దారిలో ఉన్న హాని కలిగించే వస్తువును తొలగించడం కూడా ఒక దానం."
ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు:
“మక్కా విజయ దినమున (ఫతహ్ మక్కా దినాన) రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రజలను ఉద్దేశించి ఇలా ప్రసంగించినారు: “ఓ ప్రజలారా! నిశ్చయంగా అల్లాహ్ మీ నుండి జాహిలియహ్ కాలపు (ఇస్లాంకు పూర్వం ఉన్న అఙ్ఞాన కాలపు) అహంకారాన్ని మరియు వారి పూర్వీకుల గురించి వారి ప్రగల్భాలను తొలగించాడు. కాబట్టి, ఇప్పుడు రెండు రకాల ప్రజలు ఉన్నారు: అల్లాహ్ దృష్టిలో నీతిమంతుడు, పవిత్రుడు మరియు గౌరవప్రదమైన వ్యక్తి మరియు అల్లాహ్ దృష్టిలో దుర్మార్గుడు, దయనీయమైన మరియు అల్పమైన వ్యక్తి. ప్రజలు ఆదము యొక్క సంతానము, మరియు అల్లాహ్ ఆదమును మట్టి నుండి సృష్టించాడు. అల్లాహ్ ఇలా అంటున్నాడు: {ఓ మానవులారా! నిశ్చయంగా మేము మిమ్మల్ని ఒక పురుషుడు మరియు ఒక స్త్రీ నుండి పుట్టించాము మరియు మీరు ఒకరినొకరు గుర్తించు కోవటానికి మిమ్మల్ని జాతులుగా మరియు తెగలుగా చేశాము. నిశ్చయంగా, మీలో ఎక్కువ దైవభీతి గలవాడే, అల్లాహ్‌ దగ్గర ఎక్కువ గౌరవం గలవాడు. నిశ్చయంగా, అల్లాహ్‌ సర్వజ్ఞుడు, సర్వం తెలిసినవాడు.} [సూరహ్ అల్ హుజురాత్ 49:13]
ప్రామాణికమైన హదీథు అత్తిర్మిదీ మరియు ఇబ్న్ హిబ్బాన్ నమోదు చేసినారు:
’నిశ్చయంగా ధర్మము సులభమైనది’ఎవరైతే దాని పట్ల కఠినంగా వ్యవహరిస్తారో అది వారి పై పైచేయి సాధిస్తుంది (అతన్ని అలసటకు గురిచేస్తుంది) కాబట్టి ఋజుమార్గాన్ని అవలంభించండి,ధర్మానికి దగ్గరగా ఉండండి, ప్రజలకు శుభవార్తలను అందించండి,అలాగే ఉదయం సాయంత్రం మరియు రాత్రుల్లో ఆరాధన ద్వారా సహాయాన్ని పొందండి.
ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ నమోదు చేసినారు: