Skip to content

దానికి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం: “నరకాగ్ని యొక్క ప్రభువైన అల్లాహ్ తప్ప ఎవ్వరూ అగ్నితో శిక్షించకూడదు” అన్నారు

అబ్దుల్లాహ్ ఇబ్న్ మస్’ఊద్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన:

“ఒక ప్రయాణములో మేము రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వెంట ఉన్నాము. అపుడు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం కాలకృత్యాలు తీర్చుకోవడానికి వెళ్ళినారు. అప్పుడే మేము హమ్మారా అనే పక్షిని దాని రెండు పిల్లలతో చూసాము. మేము దాని పిల్లలను పట్టుకున్నాము. ఆ పక్షి వచ్చి దాని రెక్కలు ఆడించడం ప్రారంభించింది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తిరిగి వచ్చి, అది చూసి: “ఈ పక్షి తన బిడ్డ కోసం దుఃఖపడేలా చేసింది ఎవరు? ఆమె బిడ్డను ఆమెకు తిరిగి ఇవ్వండి” అన్నారు. తరువాత ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం మేము కాల్చివేసిన ఒక చీమల పుట్టను చూసి: “దీనిని ఎవరు కాల్చారు?” అని అడిగినారు. దానికి మేము: “మేము కాల్చినాము” అన్నాము. దానికి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం: “నరకాగ్ని యొక్క ప్రభువైన అల్లాహ్ తప్ప ఎవ్వరూ అగ్నితో శిక్షించకూడదు” అన్నారు.

كُنَّا مَعَ رَسُولِ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ فِي سَفَرٍ، فَانْطَلَقَ لِحَاجَتِهِ، فَرَأَيْنَا حُمَّرَةً مَعَهَا فَرْخَانِ، فَأَخَذْنَا فَرْخَيْهَا، فَجَاءَتِ الْحُمَرَةُ فَجَعَلَتْ تَفْرِشُ، فَجَاءَ النَّبِيُّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ فَقَالَ: «مَنْ فَجَعَ هَذِهِ بِوَلَدِهَا؟ رُدُّوا وَلَدَهَا إِلَيْهَا»، وَرَأَى قَرْيَةَ نَمْلٍ قَدْ حَرَّقْنَاهَا، فَقَالَ: «مَنْ حَرَّقَ هَذِهِ؟» قُلْنَا: نَحْنُ. قَالَ: «إِنَّهُ لَا يَنْبَغِي أَنْ يُعَذِّبَ بِالنَّارِ إِلَّا رَبُّ النَّارِ».

అబూదావూద్ నమోదు చేసినారు:
ప్రామాణికమైన హదీథు
వ్యాఖ్యానము

ఈ హదీథులో అబ్దుల్లాహ్ ఇబ్న్ మస్’ఊద్ రదియల్లాహు అన్హు ఇలా ప్రస్తావిస్తున్నారు: ఒకసారి వారందరూ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వెంట ప్రయాణిస్తున్నారు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం కాలకృత్యాలు తీర్చుకోవడానికి వెళ్ళరు. అప్పుడే ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం సహచరులు రెండు పిల్లలు కలిగి ఉన్న ఒక హుమ్మర్ పక్షిని చూసారు. వారు ఆ పక్షి రెండు పిల్లలను పట్టుకున్నారు, దాంతో ఆ పక్షి తన రెండు పిల్లలను కోల్పోయినందుకు భయంతో తన రెక్కలను అల్లాడిస్తూ తిరగడం ప్రారంభించింది. ఇంతలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వచ్చినారు, ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం అది చూసి ఇలా అన్నారు: "దాని పిల్లలను తీసుకుని దానికి బాధ కలిగించి, భయపెట్టింది ఎవరు?" తరువాత ఆ పక్షి పిల్లలను దాని వాటి తల్లికి తిరిగి ఇవ్వమని ఆజ్ఞాపించారు. ఆ తరువాత, ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం అగ్నితో కాలిపోయిన చీమల పుట్టను చూసి, ఆయన ఇలా అన్నారు: “దీనిని ఎవరు కాల్చారు?” కొంతమంది సహచరులు (సహాబాలు) “మేము” అని జవాబిచ్చినారు. వారితో ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం: “ప్రాణాలతో జీవించి ఉన్న ఎవరినీ కూడా, అగ్నితో శిక్షించడానికి ఎవరికీ అనుమతి లేదు, దానిని సృష్టించిన అల్లాహ్’కు తప్ప.”

హదీథు యొక్క ప్రయోజనాలలో నుండి

కాలకృత్యాలు తీర్చుకొనునపుడు గోప్యత పాటించాలని సిఫార్సు చేయబడుచున్నది.

పశుపక్ష్యాదుల పిల్లలను పట్టి ఉంచుకుని వాటికి బాధ కలిగించడం నిషేధము.

నిప్పుతో (బ్రతికి ఉన్న) క్రిమికీటకాలను కాల్చి చంపడం నిషేధము.

జంతువుల పట్ల దయ మరియు కరుణను ప్రోత్సహించడం అనేది ఇస్లాంలో చాలా కాలంగా ఉన్న మార్గదర్శకం.

ఈ హదీథు ద్వారా జంతువుల పట్ల ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కరుణ తెలుస్తున్నది.

అగ్నితో శిక్షించడం అనేది సర్వశక్తిమంతుడైన అల్లాహ్ కు మాత్రమే ప్రత్యేకమైనది.

సమీక్షకుడు

సునన్ అబీదావూద్ (4/ 309) (2675).

ఇంకా (8)

نزهة المتقين.

لمجموعة من الباحثين (2/ 1105).

كنوز رياض الصالحين.

لمجموعة من الباحثين (19/ 150).

بهجة الناظرين.

لسليم الهلالي (3/ 120).

شرح رياض الصالحين.

لابن عثيمين (6/ 300).